భారత్ క్రికెట్ జట్టు ఈ దశాబ్దపు చివరి మ్యాచ్ ఆడడానికి సిద్ధమవుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 1:30 నుండి కటక్ లోని బారాబతి స్టేడియం లో భారత్ వెస్టిండీస్ మధ్య సిరీస్ లో ఆఖరి వన్డే జరుగుతున్నది. ఈ మ్యాచ్లో విజయం సాధించి తమ రికార్డును పదిలం గా ఉంచుకోవాలని భారత ఆశ పడుతుంది. అలాగే ఎలాగైనా భారత్ మీద విజయం సాధించి పది సంవత్సరాల తర్వాత భారత్లో సిరీస్ గెలవాలని లక్ష్యంతో వెస్టిండీస్ బరిలోకి దిగుతుంది.

 

 టి20 సిరీస్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో భారత్ విజయానికి ఎంతో కష్టపడిన విరాట్ కోహ్లీ వన్డే సిరీస్లో మాత్రం పేలవమైన ప్రదర్శనతో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డేల్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే సాధించాడు విరాట్ కోహ్లీ. కానీ ఈ మ్యాచ్లో తన పరుగుల దాహం తీర్చు కోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే ఈ వేదిక విరాట్ కోహ్లీకి అంతగా అచ్చి రాలేదనే చెప్పాలి. ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్ల్లో అతనికి కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు, దీంతో అతని మీద ఒత్తిడి పెరిగింది.

 

 అలాగే రోహిత్ శర్మ గత మ్యాచ్లో సెంచరీ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ గత టి20 సిరీస్ అలాగే వన్డేలో కూడా అద్భుతమైన ఫామ్ లో కొనసాగిస్తున్నాడు. ఇక లోయర్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఇద్దరూ కూడా సమన్వయంతో ఆడుతున్న డంతో భారత్ కు లోయర్ ఆర్డర్ కష్టాలు తీరినట్లే కనిపిస్తుంది. గత మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ తీసిన కుల్దీప్ యాదవ్ కూడా ఫామ్ లోకి రావడం భారత్ కి కలిసొచ్చే అవకాశం.

 

 ఇక ఈ సిరీస్ తర్వాత వచ్చే నెలలో శ్రీలంకతో మూడు వన్డేలు అలాగే ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది భారత్ క్రికెట్ జట్టు. ఆ తర్వాత న్యూజిలాండ్ సిరీస్ కి బయల్దేరుతుంది భారత జట్టు. ఇక ఈ మ్యాచ్లో కోహ్లీ 56 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో  జాక్వెస్ కలిస్ ను దాటి ఏడవ స్థానానికి వెళ్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: