ప్రస్తుతం ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ క్రిస్‌ జోర్డాన్‌ అందరి దృష్టిలో  హాట్‌టాపిక్‌గా మారాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో భాగంగా పెర్త్‌ స్కాచర్స్‌ తరుపున ఆడుతున్నారు  ఈ ఆటలో క్రిస్‌ జోర్డాన్‌ ఓ  స్టన్నింగ్‌ క్యాచ్‌తో అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఈ సంఘటన బీబీఎల్‌లో భాగంగా మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌-పెర్త్‌ స్కాచర్స్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇలా జరిగింది  . 

 

మెల్‌​బోర్న్‌ బ్యాటింగ్‌ సందర్భంగా ఆ జట్టు ఆల్‌రౌండర్‌ క్రిస్టియాన్‌ లాంగాన్‌ వైపు భారీ షాట్‌ను   కొట్టాడు. అయితే అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న జోర్డాన్‌ గాల్లోకి అమాంతం ఎగిరి ఆ బంతిని వదలకుండా  క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన క్రిస్టియాన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఐసీసీ దీనికి సంబంధించిన వీడియోను  షేర్‌ చేసింది. దీంతో ఈ స్టన్నింగ్‌ క్యాచ్‌ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఈ  వీడియోను చూసిన నెటిజన్లు కూడా షాక్ కి గురైయ్యారు. 

 


ఇక తాజాగా  క్రిస్‌ జోర్డాన్‌ను  ముగిసిన ఐపీఎల్‌ వేలంలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ. 3 కోట్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌కు బౌలర్‌తో పాటు మంచి ఫీల్డర్‌  జోర్డాన్‌ రూపంలో దొరికాడంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.  మరో నెటిజన్‌ ‘పంజాబ్‌ ఊపిరి పీల్చుకో.. మిమ్మల్ని గెలిపించడానికి జోర్డాన్‌ వస్తున్నాడు’ అంటూ సరదాగా కామెంట్‌ చేశాడు. 

 

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్‌బోర్న్‌ 185 పరుగులకే పరిమితమై ఓటమిచవిచూసింది. ఐపీఎల్‌లో అంతగా మంచి రికార్డులు లేని జోర్డాన్‌ ఈసారి పంజాబ్‌ తరుపున ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక ఐపీఎల్‌ చరిత్రలో పంజాబ్‌ ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గలేదు. తాజాగా కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని నయా పంజాబ్‌ జట్టు వచ్చే సీజన్‌లో శక్తిమేర పోరాడాలని భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: