విండీస్ తో జరుగుతున్న మూడో వన్డేతో సిరీస్ డిసైడ్ కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో సైని అరంగేట్రం చేసాడు. మొదటి పది ఓవర్ లలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. బ్యాటింగ్ కు అనుకూలించే ఇక్కడి పిచ్ పై ప్రమాదకర విండీస్ ఓపెనర్లను ఓ మోస్తరు స్కోర్లకు అవుట్ చేశారు. విండీస్ కు ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (21), షాయ్ హోప్ (42) శుభారంభాన్నందించారు. తొలి వికెట్ కు 57 పరుగులు జోడించారు. అయితే, స్పిన్నర్ రవీంద్ర జడేజా టీమిండియాకు బ్రేకిచ్చాడు. లూయిస్ ను అవుట్ చేసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆ తర్వాత కాసేపటికే హోప్ ను షమీ అవుట్ చేయడంతో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది.

 

ఛేజ్ కు హెట్ మయర్ జతకలవడంతో విండీస్ ఇన్నింగ్స్ నిలకడగా కొనసాగింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అరంగ్రేట బౌలర్ నవదీప్ సైని విడగొట్టాడు. అతని బౌలింగ్ లో కుల్దీప్ కు క్యాచ్ ఇచ్చి హెట్ మయర్ వెనుదిరగ్గా తర్వాత కొద్దిసేపటికే ఒక అద్భుతమైన యార్కర్ తో ఛేజ్ ను పెవిలియన్ కు పంపిన సైని విండీస్ కు హెచ్చరికలు పంపాడు.


రెండో వన్డేలో డక్ అవుట్ అయిన పోలార్డ్ చివరి వన్డేలో రెచ్చిపోయాడు. ఇక రెండో వన్డేలో భారత బౌలర్లపై రెచ్చిపోయిన పూరన్ మూడో వన్డేలో కూడా అదరగొట్టాడు. హెట్ మయర్ అవుట్ అయ్యాక వచ్చిన పోలార్డ్ పూరన్ తో కలిసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చివరి ఓవర్లలో వీరిద్దరూ మరింత రెచ్చిపోయారు. అయితే 48 ఓవర్లో పూరన్ అవుట్ కావడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. పూరన్ ఇంకా రెండు ఓవర్ లు ఉండి ఉంటే విండీస్ భారీ స్కోర్ చేసేదే.    

 

సిరీస్ 1- 1 తో సమంగా ఉన్న నేపథ్యంలో భారమంతా బ్యాట్స్ మెన్ పైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా విరాట్, రోహిత్ లక్ష్యఛేదనలో కీలకం ఉన్నారు. వీరిద్దరూ చెలరిగేతే భారత్ కు విజయం నల్లేరుపై నడకే అవుతుంది..

విండీస్ స్కోర్: 315 - 5

మరింత సమాచారం తెలుసుకోండి: