మహేంద్రసింగ్‌ ధోని... భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని స్వర్ణ అక్షరాలతో లికించుకున్నా వ్యక్తి. మహేంద్రసింగ్‌ ధోని బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీ ఇలా ఎందులో అయినా సరే తన పేరు మీద ఒక రికార్డు కచ్చితంగా ఉంటుంది. తన కెప్టెన్సీలో ఇక భారత్ ఇక ఏమి సాదించవలిసింది ఏమి లేదు అన్నట్లుగా ఐసీసీ నిర్వహించే ప్రతి ఒక్క ట్రోఫీని భారత్ దేశానికీ ధోని అందించేశాడు. ఇన్ని విజయాలు అందించిన భారత దేశ క్రికెట్ మాజీ కెప్టెన్ అయిన మహేంద్రసింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు 15 ఏళ్లు పూర్తయ్యాయి. 

 


2004 సంవత్సరంలో సౌరవ్‌ గంగూలీ సారథ్యంలో అరంగేట్రం చేసిన ధోని సోమవారం డిసెంబర్‌ 23తో 15 ఏళ్ల కెరీర్‌ ను పూర్తి చేసుకున్నాడు. భారత క్రికెట్‌ లో అత్యంత విజయవంతమైన సారథిగా ఘనతకెక్కిన ఈ జార్ఖండ్‌ స్టార్‌ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 17, 266 పరుగులు చేశాడు. 38 ఏళ్ల ఈ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌ మన్‌ ఇప్పటివరకు 350 వన్డేలు, 98 టి20లు, 90 టెస్టులు ఆడాడు. తాను మొత్తానికి 829 వికెట్ల పతనంలో అతను పాలు పంచుకున్నాడు.

 

అతని సారథ్యంలో భారత్‌ ఇటు పొట్టి ఫార్మాట్‌ (2007) లో, అటు వన్డేల్లో (2011) ప్రపంచకప్‌ విజేతగా భారత్ నిలిచింది. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిపించిన ఏకైక భారత సారథిగా ధోనిది కీలకమైన పాత్ర. 2013లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీలోనూ ధోని సేన కప్ గెలిచింది. టీమిండియాను ఐసీసీ టెస్టు, వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిపిన ఘనత కూడా ధోనిదే. ప్రస్తుతం అతని చుట్టూ రిటైర్మెంట్‌ వార్తలు ఎన్ని వస్తున్నా ఇప్పటివరకు తను మాత్రం అధికారికంగా ధోని వెల్లడించలేదు. జనవరి దాకా తనను ఈ విషయమై అడగొద్దని ఇటీవల మీడియాతో ధోని అన్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ తర్వాత అతను అసలు ఏ మ్యాచ్ లో బరిలోకి దిగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: