వచ్చే  ఏడాది మార్చి 18న ,అలాగే 21న   బంగ్లాదేశ్ లో ఆసియా ఎలెవెన్ అలాగే  వరల్డ్ ఎలెవన్  జట్ల  మధ్య  రెండు  టీ 20 మ్యాచ్ లు జరుగనున్న  సంగతి తెలిసిందే.  బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్  రెహమాన్  శత  జయంతి సందర్భంగా  ఆదేశ  క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా ఈ మ్యాచ్ లను  నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది.  మిర్పూర్ లోని షేర్ -ఏ- నేషనల్   స్టేడియం మ్యాచ్ లకు వేదిక కానుంది. ఇక  ఆసియా ఎలెవన్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించడానికి  భారత ఆటగాళ్ల ను పంపాలని  బీసీబీ  ఇప్పటికే  బీసీసీఐ ను  కోరింది.  బీసీసీఐ కూడా ఆటగాళ్లను పంపించడానికి  అంగీకరించింది. 
 
అయితే ఈ మ్యాచ్ లకు  టీమిండియా నుండి 5గురు  ఆటగాళ్లను మాత్రమే పంపనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీసీసీబీ  అధ్యక్షడు  సౌరవ్ గంగూలీ  ఆ ఆటగాళ్లు ఎవరనేది కూడా నిర్ణయించాడని సమాచారం.   బోర్డు వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం  మాజీ సారథి ధోని , ఓపెనర్  రోహిత్ శర్మ , కెప్టెన్ కోహ్లీ, అల్ రౌండర్  హార్దిక్ పాండ్య తోపాటు యువ ఫాస్ట్  బౌలర్  బుమ్రా ఆసియా ఎలెవన్ తరపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు  తెలుస్తుంది. అయితే  ఇందులో ధోని తప్ప మిగితా నలుగురు  ఆటగాళ్లు  దాదాపు కన్ ఫర్మ్ అయినట్లే.  ధోని  విషయంలో  త్వరలోనే  క్లారిటీ రానుంది. వీరితోపాటు  బంగ్లాదేశ్ , శ్రీలంక , ఆఫ్ఘానిస్తాన్  జట్ల లోని  స్టార్  ఆటగాళ్లు  కూడా  ఆసియా ఎలెవన్  తరపున బరిలోకి దిగనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: