ఇప్పటి వరకు ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదిన ఘనత రవిశాస్త్రి , యువరాజ్ సింగ్ , హెర్షల్ గిబ్స్ , రవీంద్ర జడేజాల సొంతం కాగా, ఇప్పుడు మరొక క్రికెటర్ వీరి సరసన చేరిపోయాడు . న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లియో కార్టర్ కూడా ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లను కొట్టి , క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్ ఆరు సిక్సర్లు సాధించిన వారి సరసన చేరాడు . న్యూజిలాండ్ సూపర్ స్మాష్ టి -20 లీగ్ టోర్నీ లో భాగంగా  ఆదివారం కాంటర్ బరి,  నార్తరన్ నైట్స్ మధ్య మ్యాచ్ జరిగింది . కాంటర్ బరి బ్యాట్స్ మెన్ అయిన కార్టర్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు .

 

29 బంతుల్లో మూడు ఫోర్లు , ఏడు సిక్సర్ల సాయం తో 70  పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు . కాగా ఇన్నింగ్స్ 16 ఓవర్ లో ప్రత్యర్థి స్పిన్నర్ అంటోన్ డేవ్ సిచ్ బౌలింగ్ లో  కార్టర్,  ఆరు బంతుల్ని ఆరు సిక్సర్లు మలిచి , ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి బంతిని బ్యాక్ వర్డ్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్స్ గా మలిచిన కార్టర్, రెండు , మూడు బంతుల్ని వరుసగా మిడ్ వికెట్ మీదుగా సిక్సర్లుగా మలిచాడు . నాల్గొవ బంతిని డిప్ స్క్వేర్ లెగ్ మీదుగా , ఐదవ బంతిని లాంగాన్ దిశ గా సిక్స్ర్ కొట్టిన కార్టర్, ఇక ఆరవ బంతిని డిప్ స్క్వేర్ లెగ్ మీదుగా సిక్సర్ గా మలిచి , ఒకే ఓవర్ లో ఆరు బంతుల్ని సిక్సర్లుగా మలిచిన బ్యాట్స్ మెన్ల జాబితాలో నిలిచాడు .

 

రవిశాస్త్రి , జడేజా , కార్టర్ లు దేశవాళీ క్రికెట్ టోర్నీ లో ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు సాధించగా , యువరాజ్ టి 20 ఇంటర్ నేషనల్ క్రికెట్ లో , గిబ్స్ వన్డే క్రికెట్ లో ఈ అరుదైన ఫిట్ తమ పేరిట నమోదు చేసుకున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: