బహుమతులు అందరూ ఇస్తారు. కానీ కొందరే బహుమతులతో పాటు హృదయాలూ గెలుచుకుంటారు. అలా ఓ అభిమాని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మనసు గెలుచుకున్నాడు. ఆ అభిమాని ఇచ్చిన ప్రత్యేక బహుమతి చూసి విరాట్ కోహ్లీ ఫుల్ ఖుషీ అయ్యాడు.

 

ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే.. పాత ఫోన్లతో విరాట్ కోహ్లీ రూపం వచ్చేలా ఓ కళాఖండం తయారు చేశాడు. పాత ఫోన్లు, వైర్ తో కలిసి కోహ్లీ రూపం వచ్చేలా కళాఖండాన్ని తయారు చేయడానికి మూడు రోజుల సమయం పట్టిందట. రాహుల్ అనే ఓ అభిమాని రూపొందించిన ఆర్ట్ పీస్ చూసి కోహ్లీ సంతోషపడ్డాడు.

 

కోహ్లీ బహుమతిపై ఆటోగ్రాఫ్ చేసి తన అభిమానికి థ్యాంక్స్ చెప్పాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో అభిమాని రాహుల్ కోహ్లీపై ఉన్న తన ప్రేమను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: