2019 వన్డే ప్రపంచ కప్ ను ఇంగ్లాండ్  గెలవడానికి ప్రధాన కారణం అజట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్. ఫైనల్ లో  వీరోచిత  ఇన్నింగ్స్ తో అతను,ఇంగ్లాండ్ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాడు. ఆతరువాత  కొద్దీ రోజులకు  యాషెస్ సిరీస్ లో  భాగంగా మూడో టెస్టు ను  ఒంటి చేత్తో గెలిపించి  మరో సారి హీరో అయ్యాడు.  ఇక ఇప్పుడు తాజాగా మరో సారి  అత్యుత్తమ ప్రదర్శన తో స్టోక్స్  ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు.

 

కేప్ టౌన్ లో సౌతాఫ్రికా తో జరిగిన రెండో టెస్టు లో ఇంగ్లాండ్ 189పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు థ్రిల్లింగ్ గా సాగిన ఈమ్యాచ్ టెస్ట్ క్రికెట్ లో అసలు మజాను రుచిచూపించింది. 438పరుగుల భారీ లక్ష్యంతో   చివరి రోజు బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా 248 పరుగులకు ఆల్ ఔటై  ఓటమిని చవిచూసింది. అయితే సౌతాఫ్రికా మరో  13ఓవర్లు కనుక ఆడి  ఉంటే  మ్యాచ్ డ్రా అయ్యేదే.  అప్పటికి చేతిలో 3వికెట్లు వున్నాయి. అనుభవజ్ఞుడైన ఫిలాండర్ క్రీజ్ లో ఉండడంతో సౌతాఫ్రికా ఆశలువదులుకోలేదు.

 

ఈదశలో 133 ఓవర్ లో  బంతిని అందుకున్నస్టోక్స్  ఆ ఓవర్ లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఆ తరువాత  137 ఓవర్ లో నాల్గో బంతికి స్టోక్స్, ఫిలాండర్ ను అవుట్ చేసి ఇంగ్లాండ్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.  ఇక ఇంగ్లాండ్ 63ఏళ్ళ తరువాత  కేప్ టౌన్ లో విజయం సాధించడం విశేషం.  స్టోక్స్  ఈ మ్యాచ్ లో బంతితో మూడు వికెట్లు తీయగా బ్యాట్ తో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 119రన్స్ చేసి ఇంగ్లాండ్ గెలుపు లో కీలక పాత్ర పోషించాడు. తద్వారా అతనికి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: