2019 అక్టోబర్ నుండి 2020 సెప్టెంబర్ వరకు టీమిండియా  ఆటగాళ్ల  కొత్త కాంట్రాక్టులను ప్రకటించింది బీసీసీఐ. మొత్తం  27మంది  ఆటగాళ్లకు ఈజాబితాలో స్థానం దక్కగా  అందులో ఆరుగురు కొత్త వారు కాగా ఇద్దరికి ప్రమోషన్ లభించింది. మయాంక్ అగర్వాల్ , దీపక్ చాహర్ , నవదీప్ సైనీ ,శార్దూల్ ఠాకూర్,వాషింగ్టన్ సుందర్ ,శ్రేయాస్ అయ్యర్ లు కొత్తగా కాంట్రాక్టు  దక్కించుకోగా  గ్రేడ్ బి నుండి కేఎల్ రాహుల్ గ్రేడ్ ఏ కు అలాగే సాహా గ్రేడ్ సి నుండి గ్రేడ్ బి కు ప్రమోట్ అయ్యారు.  ఇక 2019 వరల్డ్ కప్ తరువాత ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో మాజీ సారథి ధోని కాంట్రాక్టు పునరుద్దించలేదు. అతని తోపాటు దినేష్ కార్తీక్, ఖలీల్ అహ్మద్ ,అంబటి రాయుడు లకు కూడా బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వలేదు. 
 
బీసీసీఐ సెంట్రల్ కాంట్రక్టులను దక్కించుకున్న ఆటగాళ్ల జాబితా : 
 
గ్రేడ్ ఏ ప్లస్ (7 కోట్లు) : కోహ్లీ , రోహిత్ శర్మ , బుమ్రా 
 
 గ్రేడ్ ఏ (5 కోట్లు) : ధావన్ , రాహుల్ , అశ్విన్ ,జడేజా ,భువనేశ్వర్ కుమార్ , పుజారా ,షమీ ,ఇషాంత్ శర్మ ,కుల్దీప్ యాదవ్ ,రిషబ్ పంత్ , అజింక్య రహానే 
 
గ్రేడ్ బి (3కోట్లు ) : సాహా , ఉమేష్ యాదవ్ ,యుజ్వేంద్ర చాహల్ ,హార్దిక్ పాండ్య ,మయాంక్ అగర్వాల్ 
 
గ్రేడ్ సి (కోటి) : శ్రేయాస్ అయ్యర్ , సైనీ , శార్దూల్ ఠాకూర్ ,సుందర్ ,దీపక్ చాహర్ , హనుమ విహారి ,మనీష్ పాండే ,కేదార్ జాదవ్ 

మరింత సమాచారం తెలుసుకోండి: