న్యూజిలాండ్ తో మొదటి టెస్టు కు ముందు మీడియా సమావేశం లో పాల్గొన్న టీమిండియా టెస్టు జట్టు వైస్ కెప్టెన్  అజింక్య రహానే, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ను పక్కకు పెట్టడం గురించి ఏమంటారు అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. బేంచ్ కే పరిమితం కావాలని ఏ ఆటగాడు కూడా కోరుకోడు..టీం అవసరాన్ని బట్టి తుది జట్టును నిర్ణయిస్తారు దాంట్లో మనకు చోటు దక్కకపోయినా కూడా ఆ నిర్ణయాన్ని స్వాగతించాలి.
 
ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి అలాగే జూనియర్ ,సీనియర్ అనే తేడా లేకుండా అందరి దగ్గర్నుండీ కొత్త విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకోవడం ద్వారానే ఎక్కువ సక్సెస్ కాగలం..ఎప్పుడూ పాజిటివ్  గావుంటూ ఇంకా బాగా కష్టపడి క్రికెటర్ గా ఇంప్రూవ్ కావాలని పంత్ కు రహానే సలహాలు ఇచ్చాడు. ఇక న్యూజిలాండ్ పర్యటనలో టీ 20 ,వన్డే సిరీస్ లలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కించుకోలేకపోయిన  పంత్ కు టెస్టుల్లో కూడా స్థానం దక్కడం అనుమానంగానే మారింది.
 
ఇదిలావుంటే రేపటి నుండే న్యూజిలాండ్ ,భారత్ ల మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ జట్టు గా కొనసాగుతున్నటీమిండియా ఆ స్థాయికి తగ్గట్లు ఆడి విజయం సాదించాలనే పట్టుదలతో ఉండగా 2017నుండి వెల్లింగ్టన్ లో ఒక్క టెస్టు కూడా ఓడిపోకుండా జైత్రయాత్ర కొనసాగిస్తున్న న్యూజిలాండ్ మరో సారి అదే ఫలితాన్నీ రిపీట్ చేయాలని భావిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: