రెండు మ్యాచ్ లటెస్టు సిరీస్ లో భాగంగా భారత్ ,న్యూజిలాండ్ లమధ్య మొదటి టెస్టు రేపు వెల్లింగ్టన్ లో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రేపు  తెల్లవారుజామున 4గంటలకే ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. సొంత గడ్డపై న్యూజిలాండ్ బలంగా కనబడుతుండగా వరుస విజయాలను సాధిస్తూ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా ఎరగకుండా దూసుకుపోతున్న టీమిండియా ,మొదటి టెస్టు లో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
 
ఇక ఈమ్యాచ్ ద్వారా న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కైల్ జమైసన్  టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. స్టార్ బౌలర్ నీల్ వాగ్నెర్, తండ్రి కావడం తో కుటుంబంతో గడపడానికి మ్యాచ్ కు దూరమయ్యాడు దాంతో జమైసన్ కు లైన్ క్లియర్ అయ్యింది అలాగే వెటరన్ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ కు ఇది 100వ టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఇక భారత్ విషయానికి వస్తే ఓపెనర్లు గా పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ రానుండగా పుజారా , రహానే ,విహారి లతో  కూడిన మిడిల్ ఆర్డర్ చాలా బలంగా కనిపిస్తుంది. కాగా పంత్ కు మరోసారి నిరాశే మిగిలనుండగా  అశ్విన్ ,జడేజా లలో ఎవరో ఒక్కరే తుది జట్టులో వుండే  అవకాశాలు వున్నాయి. ఇక ఇషాంత్ శర్మ జట్టు తో కలవడం తో బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తుంది. 
 
తుది జట్లు (అంచనా ) : 
 
భారత్ : పృథ్వీ షా ,మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్) ,పుజారా, రహానే , సాహా(కీపర్), హనుమ విహారి ,రవీంద్ర జడేజా /అశ్విన్ ,బుమ్రా ,షమీ/ఉమేష్ యాదవ్ ,ఇషాంత్ శర్మ 
 
న్యూజిలాండ్ : టామ్ లేతమ్ ,టామ్ బ్లండెల్, విలియమ్సన్(కెప్టెన్),టేలర్ ,వాట్లింగ్ (కీపర్) ,గ్రాండ్ హోమ్, నికోల్స్, అజాజ్ పటేల్ , సౌథీ, బౌల్ట్, జైమేసన్
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: