స్వదేశం లో భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్.. టెస్టు సిరీస్ ను కూడా  వైట్ వాష్  చేయాలని ఊవిళ్లూరుతుంది. అందులో భాగంగా మొదటి టెస్టు ను మూడున్నర రోజుల్లోనే ముగించి విజయాన్ని అందుకున్న కివీస్ ..  ఈనెల 29నుండి ప్రారంభం కానున్న రెండో టెస్టును కూడా అదే ఆటతీరుతో గెలుచి సిరీస్ ను కైవసం చేసుకువాలని చూస్తుంది. ఇక ఈటెస్టు కు ముందు న్యూజిలాండ్ మరింత బలంగా కనిపిస్తుంది.  ఎందుకంటే నెంబర్ 2 టెస్టు ర్యాంక్ బౌలర్ వాగ్నెర్ జట్టుతో కలువనున్నాడు.
 
మొదటి టెస్టు కు ముందు తండ్రి  కావడం తో కుటుంబంతో గడపడానికి ఆ టెస్టుకు దూరమైన వాగ్నెర్ రెండో టెస్టు కు అందుబాటులో ఉండనున్నాడు అయితే వాగ్నెర్ రాక తో మేనేజ్ మెంట్ కు ఎవరిని తీసేయాలో అర్ధం కావడం లేదట మొదటి టెస్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు... సౌథీ ,బౌల్ట్ , జమైసన్ రాణించారు దాంతో వీరిలో ఎవరిని పక్కకు పెట్టాలో తెలియడం లేదట అయితే స్పిన్నర్ అజాజ్ పటేల్ ను తీసేసి ఆస్థానం లో  వాగ్నెర్ ను తీసుకోవచ్చు అలా చేస్తే స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా పోతాడు.  మరి  వాగ్నెర్ కోసం ఎవరిని బలి చేస్తారో చూడాలి. 
 
ఇక బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాల్లో విఫలమై మొదటి టెస్టులో చిత్తుగా ఓడిన టీమిండియా రెండో టెస్టునైనా గెలుచుకొని పరువు నిలుపుకోవాలని భావిస్తుంది. అందుకోసం రెండో టెస్టు లో మార్పులు చేయనుంది. పృథ్వీ షా స్థానం లో శుభ్మాన్ గిల్ ను అశ్విన్ స్థానం లో జడేజా ను అలాగే బుమ్రా స్థానం లో ఉమేష్ యాదవ్ ను తీసుకోవాలని కోహ్లీ భావిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: