ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. ఇప్ప‌టికే రెండు మ్యాచ్‌లు ఆడిన టీం ఇండియా జ‌ట్టు రెండు మ్యాచ్ల్‌ల్లోనూ ఘ‌న‌విజ‌యం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఏకంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన హర్మన్‌ సేన.. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఈ రెండు మ్యాచ్ల్‌ల్లోనూ టీం ఇండియా ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంది.



ఇక దేశ‌వ్యాప్తంగా టీం ఇండియాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే ఇక ఈ టోర్న‌మెంట్‌లో భార‌త జ‌ట్టులో ఓవ‌రాల్‌గా హైలెట్ అవుతోంది టీనేజ్‌ ఓపెనర్‌ షఫాలీ. ఆమెపై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఆమె తొలి నుంచి దూకుడైన బ్యాటింగ్‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల భ‌రతం ప‌డుతున్నారు. దీంతో విమ‌ర్శ‌కులు సైతం ఆమె దూకుడుకు ఫిదా అవుతున్నారు.



ప్ర‌పంచ‌క‌ప్ లాంటి మెగా టోర్నీలో కేవలం 16 ఏళ్ల ష‌పాలీ ఎలాంటి బెరుకు లేకుండా దూకుడుగా ఆడ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ఇక సీనియ‌ర్ మ‌హిళా క్రికెట‌ర్లు సైతం ఈ వ‌య‌స్సులో ఆమె దూకుడు ఆట‌తీరు చూసి ముచ్చ‌ట ప‌డుతున్నారు. ష‌పాలీ భావి భార‌త క్రికెట్‌కు మంచి ఆశాకిర‌ణ‌మ‌ని అంటున్నారు.  మ‌రో యంగ్‌ క్రికెటర్‌ రోడ్రిగ్స్‌ ఎంతో అనుభవం కలిగిన బ్యాటర్‌గా రాణిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: