ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ 20 ప్రపంచకప్ లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈమ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్ల లో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు హీలీ (83),మూనీ(81) మెరుపులు మెరిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో 20ఓవర్ల లో 9వికెట్లు కోల్పోయి 103 పరుగులే చేసి బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిపోయింది. ఇక 53బంతుల్లో 10ఫోర్లు ,3 సిక్సర్ల తో 83పరుగులు చేసిన హీలీకి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ రోజు ఆమె ఈ అవార్డు ను సొంతం చేసుకోగా నిన్న ఆమె భర్త కూడా ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. 
 
ఇంతకీ ఆమె భర్త ఎవరనుకుంటున్నారా..  అదేనండీ ఆసీస్ స్టార్ పేసర్ స్టార్క్. నిన్న సౌతాఫ్రికా తో జరిగిన మూడో టీ 20 లో మూడు వికెట్లు తీసిన స్టార్క్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్  దక్కింది. ఇక నాలుగు సంవత్సరాల క్రితం స్టార్క్ ,హీలీ ని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరు ప్రస్తుతం తమ జట్లలో  కీలక ప్లేయర్లు గా వెలుగొందుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: