ధోని భారత క్రికెట్ కెప్టెన్ లో ఒక్కరు. అతను కెప్టెన్ గా ఉన్నపుడు అరుదైన రికార్డులను ఎన్నో సాధించారు. 2004, డిసెంబరు 23న భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన మహేంద్రసింగ్ ధోనీ ఇప్పటి వరకూ 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ధోనీ.. మ్యాచ్‌‌లని గెలుపుగా ముగించడంలో తనదైన ముద్ర వేశాడు. అయితే తాజాగా ధోని 2011లో వాడిన బ్యాట్ ను వేలానికి ఇచ్చాడు. 

 

IHG

 

2007లో కెప్టెన్‌గా భారత్‌కి తొలి టీ20 ప్రపంచకప్ అందించిన మహేంద్రసింగ్ ధోనీ. ఆ తర్వాత 2011 వన్డే ప్రపంచకప్‌ లోనూ టీమిండియాని విజేతగా నిలిపాడు. ఇక 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్ గెలవడం ద్వారా.. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకున్నాడు. 

 

IHG


2011 వన్డే ప్రపంచకప్‌‌లో ధోనీ ఎక్కువగా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. కానీ.. ఫైనల్లో మాత్రం ఒక స్థానం ముందుకు వెళ్లి.. సూపర్ ఫామ్‌లో ఉన్న యువరాజ్ సింగ్‌ని ఆరోస్థానానికి పంపాడు. అప్పట్లో ఈ బ్యాటింగ్‌ మార్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ.. టీమ్ ప్రయోజనాల కోసమే తన బ్యాటింగ్ ఆర్డర్‌ని మార్చుకున్నట్లు ధోనీ చాలా సార్లు వివరణ ఇచ్చుకున్నాడు.

 

IHG

 

2011 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఆ బ్యాట్‌ని అలానే గుర్తుగా ఉంచుకున్న ధోనీ.. తాజాగా సాక్షి ఫౌండేషన్‌ కోసం వేలానికి ఇచ్చేశాడు. పేద పిల్లల సంరక్షణ బాధ్యతని చూస్తున్న ఈ ఫౌండేషన్‌ని ధోనీ భార్య సాక్షి నడిపిస్తుండగా.. వేలంలో ధోనీ బ్యాట్‌ ఏకంగా రూ. 83 లక్షలకి అమ్ముడుపోయింది. ఆ బ్యాట్ ధర మార్కెట్‌లో రూ. 4-5 వేలు ఉండొచ్చు. వరల్డ్‌ కప్ ఫైనల్లో సిక్స్ కొట్టిన బ్యాట్ కావడంతో ఆర్కే గ్లోబల్ షేర్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ గ్రూప్ భారీ ధరని వెచ్చించి కొనుగోలు చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: