ఈ రోజు జరుగుతున్న ఆస్ట్రేలియా, భారత మహిళల జట్ల మధ్య జరుగుతున్న టీ - 20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ని మొదలు పెట్టింది. బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా మహిళల జట్టు ఓపనర్లు కళ్లు చెదిరే ఆరంభాన్ని అందించారు. వారిద్దరూ ఆకాశమే హద్దుగా బౌండరీలతో, సిక్సర్లతో భారత బౌలర్లని ఒక అట అట ఆడుకున్నారు. అయితే ఓపెనర్ గా వచ్చిన ఓపెనర్లు ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. 

 

 


ఇందులో ముఖ్యంగా  ఆస్ట్రేలియా ఓపెనర్ అలైస్స హీలీ మొదటి ఓవర్ నుంచే తాను ఉన్న ఫామ్ కి తగ్గట్టు రెచ్చిపోయింది. మొత్తానికి అలైస్స హీలీ కేవలం 39 బంతుల్లో 79 పరుగులు చేసి పూనమ్ యాదవ్ బౌలింగ్ లో కృష్ణ మూర్తికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. ఆస్ట్రేలియా నిర్ణిత 20 ఓవర్లకు కాను 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు సాధించింది. ఇందులో మోని 54 బంతుల్లో 78 పరుగులు (నాటౌట్), లాంనింగ్ 15 బంతుల్లో 16 పరుగులు, గార్డనర్ 2 పరుగులు , కారెయ్ 5 పరుగులు చేశారు.

 

 


అలాగే భారత మహిళా జట్టు బౌలర్లందరూ ధారాళంగా పరుగులు ఇచ్చేసారు. ఇందులో DB శర్మ 2 వికెట్లు, పూనమ్ యాదవ్, RP యాదవ్ చెరో ఒక వికెట్ సాధించారు. దీనితో భారత్ టార్గెట్ 185 పరుగులుగా ఆస్ట్రేలియా నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: