స‌చిన్ టెండూల్క‌ర్‌.. ప్ర‌పంచంలోనే మేటి బ్యాన్స్‌మ‌న్‌! అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌చిన్ 24 ఏళ్ల‌పాటు టీమిండియాకు సేవ‌లు అందించిన గొప్ప ఆట‌గాడు. ఈ రోజు ఆయ‌న‌ 47వ పుట్టిన రోజు. క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకోవ‌డం లేద‌ని స‌చిన్ చెప్పార‌. డాక్ట‌ర్లు, న‌ర్సులు, పారామెడిక్స్‌, పోలీసుల‌, డిఫెన్స్ ఉద్యోగుల‌కు ఇప్పుడు ఇప్పుడు మ‌నం సంక‌ల్ప సంఘీభావం తెలిపే స‌మ‌యమ‌ని ఆయ‌న అన్నారు. కాగా, లాక్‌డౌన్ కార‌ణంగా స‌చిన్ త‌న కుబుంబంతోనే ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నారు.  ఇంట్లోనే ఉండ‌డంతో వంట చేస్తున్నాన‌ని, చెట్ల‌కు నీళ్లు పోస్తున్నాన‌ని చెప్పారు. పిల్ల‌లు సారా, అర్జున్‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్నాన‌ని అంటున్నారు. ఇదిలా ఉండ‌గా.. స‌చిన్ టెండూల్క‌ర్ ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 ల‌క్ష‌లు అంద‌జేశారు. పేద‌ల కోసం ప‌లు స‌హాయ‌క కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. 

 

16ఏళ్ల వ‌య‌స్సులోనే స‌చిన్ టెండూల్క‌ర్ పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. త‌న కెరీర్‌లో ట‌న్నుల‌కొద్దీ ప‌రుగులు సాధించారు. ఇక అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు స‌చిన్ 2013లో ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌ర‌గులు సాధించిన క్రికెట‌ర్‌గా నిలిచాడు.  అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి అత‌ను 34,457 ర‌న్స్ చేశాడు.  200 టెస్టుల్లో 15,921 ప‌రుగులు, 463 వ‌న్డేల్లో 18426 ర‌న్స్, ఒక‌ టీ20లో ప‌ది ర‌న్స్ చేశాడ‌త‌ను. వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీ కొట్టిన తొలి క్రికెటర్‌గా స‌చిన్ నిలిచాడు. 2010, ఫిబ్ర‌వ‌రి 24వ తేదీన గ్వాలియ‌ర్‌లో సౌతాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌ను 147 బంతుల్లో 200 స్కోర్ చేశాడు. అంతేగాకుండా.. రికార్డు స్థాయిలో సచిన్ టెండూల్క‌ర్‌ ఆరు ప్ర‌పంచ క‌ప్‌ల్లో ఆడాడు. ద‌టీజ్‌..స‌చిన్‌! ఈ రోజు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.   

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: