పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ హుల్ హాక్ టీమిండియా ఆటగాళ్ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత అటగాళ్లు వారి కోసమే ఆడుతారని కానీ పాక్ ఆటగాళ్లు టీం కోసం కూడా ఆడుతారని ఇంజమామ్ అన్నాడు. 1980 నుండి 2000 వరకు పాకిస్థాన్ ,టీమిండియా పై ఆధిక్యాన్ని ప్రదర్శించేది. పేపర్ పైనే భారత్ బ్యాటింగ్ లైన్ అప్ బలంగా ఉండేది కానీ మ్యాచ్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయేవారు మా బ్యాట్స్ మెన్లు 30నుండి  40 రన్స్ చేసిన అది టీం కోసమే చేసేవారు కానీ  భారత క్రికెటర్లు 100 రన్స్ చేసిన అది వారి కోసమే  చేసుకొనేవారని ఇంజమామ్ తాజాగా జరిగిన  ఇంటర్వ్యూ  లో వ్యాఖ్యానించాడు. 
 
అలాగే మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ పై ప్రశంసలు కురిపించాడు ఇంజమామ్. ఇమ్రాన్ టెక్నీకల్ గా అంత గొప్పకెప్టెన్ కాదు కానీ జట్టును ఎలా ముందుండి నడపాలో అతనికి తెలుసు. యువ ఆటగాళ్లపై ఎక్కువగా నమ్మకం వుంచేవాడు అదే ఇమ్రాన్ ను గొప్ప కెప్టెన్ ను చేసిందని ఇంజమామ్ కొనియాడాడు. ఇక పాకిస్థాన్  తరపున దాదాపు 16 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించిన ఇంజమామ్ జట్టుకు తన నాయకత్వం లో ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.
 
సొంత గడ్డపై మాత్రమే విదేశాల్లో కూడా ఆధిక్యం ప్రదర్శించి నంబర్ వన్ జట్టు ఆస్ట్రేలియా కూడా చాలా సందర్భాల్లో చమటలు పట్టించింది. అయితే ఇంజమామ్ ,మహమ్మద్ యూసఫ్ ఆతరువాత మిస్బా ఉల్ హాక్ ఎప్పుడైతే  రిటైర్ అయ్యారో పాక్ క్రికెట్ పరిస్థితి అద్వానంగా తయారైంది. జట్టును ముందుండి నడిపించగల సమర్ధవంతడైన కెప్టెన్ లేకపోవడం అలాగే ఫిక్సింగ్, టీంలో అంతర్గత  గొడవలతో ఆ జట్టు ప్రతిష్ట దెబ్బతింది. 
 
   
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: