లాక్ డౌన్ సమయంలో టిక్ టాక్ స్టార్ గా మారిన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియాలో చదువుతున్న ఓ భారతీయ విద్యార్థిని మెచ్చుకున్నాడు. ఈ కరోనా కాలంలో అతను చేస్తున్న కృషికి డేవిడ్ వార్నర్ ధన్యవాదాలు తెలిపాడు. క్వీన్స్ ల్యాండ్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న బెంగుళూరు నగరానికి చెందిన శ్రేయస్ శ్రేష్ట్ ప్రస్తుతం అక్కడ చాల మంది ఉద్యోగాలు పోయి అనేక మంది విద్యార్థులు అవస్థలు పడుతుడడంతో తాను చదువుకున్న విశ్వవిద్యాలయంలో సామాజిక సేవా బృందంలో చేరి అక్కడ కష్టాల్లో ఉన్న విద్యార్థులకు అనేకమందికి భోజన సదుపాయాలు అతను అందిస్తున్నాడు. దాంతో అతని సేవలను గుర్తించిన డేవిడ్ వార్నర్ ఓ వీడియో రూపంలో శ్రేయాస్ కు అభినందనలు తెలియ జేశాడు.

 

ఆ వీడియోలో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ... నమస్తే, నేను ఇక్కడ శ్రేయస్సుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. కరోనా వైరస్ నెలకొన్న పరిస్థితుల్లో అతను చాలా మంచి పని చేస్తున్నాడు అంటూ, అలాగే అవసరమైన వారికి భోజన సదుపాయాలు అందజేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఇలాంటి నిస్వార్ధమైన సేవకు తాను అభినందనలు తెలియజేస్తున్నాను అంటూ..  శ్రేయస్ తల్లిదండ్రుల తోపాటు... భారతదేశం మొత్తం నిన్ను చూసి గర్వ పడుతుంది. నువ్వు నీ మంచి పని ఇలాగే కొనసాగించు... ఈ కష్ట పరిస్థితుల్లో మనమంతా కలిసి ఉన్నాం అని చెప్పుకొచ్చాడు.

 

ఇక ఇదే విషయం మీద ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన గిల్ క్రిస్ట్ కూడా భారతీయ నర్సింగ్ విద్యార్థిని ఆయన ప్రశంసించాడు. ఈ కరోనా సమయంలో ఆమె కూడా ఇక్కడ సేవ సేవ చేస్తుందని గిల్ క్రిస్ట్ తెలిపిన సంగతి తెలిసిందే. వల్లం గాంగ్ విశ్వవిద్యాలయంలో నర్సింగ్ కోర్సు అభ్యసిస్తున్న షారోన్ వర్జెసి అక్కడ ఓ సామాజిక ఆరోగ్య కార్యకర్తగా తన సేవలను అందించడం ముందులో ఉంది. దీనితో గిల్ క్రిస్ట్ ఆమెని అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: