ఎన్ని ప్రపంచ కప్ లు జరిగిన ఒక్కసారి కూడా ప్రపంచ కప్ ను గెలుచుకోలేని దేశాల్లో ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఉంటాయి. ఇకపోతే 1999 వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ లో దిగిన దక్షిణాఫ్రికా జట్టు ను అందులో చేసిన మిస్ ఫీల్డ్ ఆ దేశానికి వరల్డ్ కప్ రాకుండా చేసిందని చెప్పవచ్చు. తన చెత్త ఫీలింగ్ తో హర్షల్ గిబ్స్ తన జట్టుకు ఆ తీరని వేదనను మిగిల్చాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ స్టీవ్ వా ఇచ్చిన సులభమైన క్యాచ్ లు పట్టుకున్నట్టే పట్టుకుని జారవిడిచాడు. దీంతో అటు మ్యాచ్ ను ఇటు ప్రపంచకప్ గెలుచుకునే అరుదైన అవకాశాన్ని దక్షిణాఫ్రికా జట్టు దూరం చేసుకుంది.

 

 


ఇకపోతే ఈ క్యాచ్ గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా ...? అవును ఆ చెత్త క్యాచ్ కి నీటితో 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ వీడియో ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసిసి ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒకవేళ గిబ్స్ ఆ క్యాచ్ పట్టి ఉంటే సౌత్ ఆఫ్రికా కి ఈ సమయానికి ఒక ప్రపంచకప్ వచ్చేదేమో. ఇకపోతే ఆస్ట్రేలియా 5 సార్లు, టీమిండియా 2 సార్లు, వెస్టిండీస్ 2 సార్లు, శ్రీలంక, పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఒక్కోసారి వరల్డ్ కప్ ను గెలుచుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: