గత కొన్ని రోజుల క్రితం గాల్వన్ లోయలో చైనా బలగాలు భారతీయ జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయులు చనిపోయారు. నిజానికి చైనా పక్కా ప్లాన్ ప్రకారం అనేకమైన కుయుక్తులతో కుట్రపూరితంగా మన భారత సైనికుల పై దాడి చేసింది. దీంతో చైనాపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ ని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడానికి కారణమైన చైనా ఏ మాత్రం బాధ్యత వహించకుండా అమెరికాపై, అమెరికా కి మద్దతు తెలుపుతున్న దేశాలపై కూడా దాడి చేస్తుంది. తాజాగా చైనా భారత్ పై చేసిన దాడి మనందరి ఆగ్రహానికి కారణమవుతుంది. 


ఈ నేపథ్యంలోనే చాలామంది చైనా వస్తువులను ద్వంసం చేస్తూ వారి వస్తువులను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారతదేశంలో చైనా ఆధారిత కంపెనీలు, రెస్టారెంట్లు ఇంకా పలు పరిశ్రమలు తట్టాబుట్టా సర్దుకుని తమ దేశానికి తరలిపోయే సమయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే బిసిసిఐ కూడా చైనా కంపెనీల పై కొరడా దెబ్బ వేయాలని ఆలోచిస్తుంది. చైనా దేశానికి చెందిన మొబైల్ తయారీ కంపెనీ వివో(VIVO) గత ఐదు సంవత్సరాలుగా రూ. 2199 కోట్లను చెల్లించి ఐపీఎల్ కు టైటిల్ స్పాన్సరర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బీసీసీఐ వివో సంస్థ యొక్క రూ. 440 కోట్ల వార్షిక ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులను రద్దు చేసే యోచనలో ఉంది. 


ప్రస్తుతానికి భారతదేశంలో చైనా వస్తువులను బ్యాన్ చేస్తున్నట్టు అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. ఒకవేళ చైనా వస్తువుల పై భారత ప్రభుత్వం బ్యాన్ విధిస్తే తాము కూడా వివో సంస్థ స్పాన్సర్షిప్ హక్కులను రద్దు చేస్తామని ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్ చెప్పుకొచ్చింది. ఈ విషయంపై పునః సమీక్షించేందుకు వచ్చేవారం ఐపీఎల్ గవర్నర్ కౌన్సిల్ ఉన్నతాధికారులు ఒక సమావేశంలో చర్చించనున్నారు. వివోతో పాటు చైనా సంబంధిత కంపెనీలైన డ్రీమ్ ఎలెవెన్, పేటీఎం స్పాన్సర్షిప్ హక్కులను రద్దు చేయాలా వద్దా అన్న దానిపై కూడా సమావేశంలో చర్చిస్తామని బీసీసీఐ అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: