సౌతాంఫ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టులో వెస్టిండీస్ పట్టు బిగిస్తుంది. ఓవర్నైట్ స్కోరు 57/1తో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 318పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఓపెనర్ బ్రాత్వయిట్(65) ,కీపర్ డౌరిచ్(61) అర్ధశతాలతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్ల లో స్టోక్స్ 4 ,ఆండర్సన్ 3 ,బెస్ 2 వికెట్లు పడగొట్టగా మార్క్ వుడ్ ఓ వికెట్ తీశాడు. ఇక యువ ఫేసర్ జోఫ్రా ఆర్చర్ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 
 
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 15పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్(10),సిబ్లీ (5*) క్రీజ్ లో వున్నారు. ఇంకా ఇంగ్లాండ్ 99పరుగులు వెనుకబడివుంది. నాలుగో రోజు వీలైనంత తొందరగా ఇంగ్లాండ్ ను ఆల్ అవుట్ చేస్తే మ్యాచ్ విండీస్ చేతుల్లోకి వచ్చినట్లే.. ఇదిలావుంటే ఈమ్యాచ్ లో అల్జారీ జోసెఫ్ ను అవుట్ చేసి ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ 150వికెట్ల క్లబ్ లో చేరాడు అంతేకాదు టెస్టుల్లో వేగంగా 4000పరుగులు అలాగే 150వికెట్లు తీసిన రెండో క్రికెటర్ గా స్టోక్స్ గుర్తింపు పొందాడు.  
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ :204/10
వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ : 318/10 
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్  : 15/0

మరింత సమాచారం తెలుసుకోండి: