బయో సెక్యూర్ ప్రోటోకాల్స్ ను బ్రేక్ చేశాడని వెస్టిండీస్ తో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ను తప్పించింది ఈసీబీ. ఇంతకీ ఆర్చర్ చేసిన తప్పేంటంటే.. సౌతాంఫ్టన్ నుండి రెండో టెస్టు జరుగనున్న మాంచెస్టర్ కు వెళుతుండగా మధ్యలో  బ్రిగ్టన్ లోని తన నివాసానికి వెళ్లి వచ్చాడు ఆర్చర్. ఇది బయో సెక్యూర్ రూల్స్ కు విరుద్ధం కావడంతో ఆర్చర్ పై వేటు వేసింది ఈసీబీ. ఇక ఆర్చర్ కూడా తన తప్పు ఒప్పుకొని బోర్డు ను క్షమాపణలు కోరాడు. ప్రస్తుతం ఆర్చర్ 5రోజుల పాటు స్వీయ నిర్బంధంలో వుండనున్నాడు. ఈమధ్యలో అతనికి రెండు సార్లు కరోనా టెస్టులు చేయనున్నారు అందులో నెగిటివ్ వస్తే ఆర్చర్ మళ్ళీ జట్టుతో కలవనున్నాడు. 
 
ఇదిలావుంటే మాంచెస్టర్ టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు దాంతో మ్యాచ్ గంటన్నర ఆలస్యంగా ప్రారంభంకానుంది. మొదటి రోజు మ్యాచ్ ను 83 ఓవర్లకు  కుదించారు. ఇక ఈటెస్టు కు ఆర్చర్ ను తప్పించడంతో అతని స్థానంలో యువ ఫాస్ట్ బౌలర్ ,సామ్ కర్రాన్ తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈమ్యాచ్ లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి టెస్టులో విజయం సాధించడంతో విండీస్ మూడు టెస్టుల ఈసిరీస్ లో 1-0 ఆధిక్యంలో వుంది. 
 
ఇంగ్లాండ్ : రూట్ (కెప్టెన్), స్టోక్స్( వైస్ కెప్టెన్), బట్లర్ ( కీపర్), బ్రాడ్ ,సామ్ కర్రాన్ , రోరీ బర్న్స్ ,ఓల్లి పోప్ ,సిబ్లే ,జాక్ క్రాలే,  డామ్ బెస్, వోక్స్  
 
వెస్టిండీస్ : జాసన్ హోల్డర్ (కెప్టెన్),బ్లాక్ వుడ్, బ్రాత్వెయిట్ ,రోస్టన్ ఛేజ్ ,బ్రూక్స్ , క్యాంప్ బెల్,షేన్ డౌరిచ్,హోప్ ,అల్జారీ జోసెఫ్ , కీమర్ రోచ్, గాబ్రియల్ 
 

మరింత సమాచారం తెలుసుకోండి: