దాయాదులను చిత్తు చేసేందుకు భారత్ క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్!
మరిన్ని

దాయాదులను చిత్తు చేసేందుకు భారత్ క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్!

రేపు ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా  భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ జరగుంది.   ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. టీమిండియా కెప్టెన్  రోహిత్ శర్మ నెట్స్ లో ప్రాక్టీస్ చేసాడు. రోహిత్ తో పాటు సీనియర్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడులు కూడా ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు.


అయితే పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే భారత క్రికెటర్స్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారన్న విషయం తెలిసిందే.  ఈ క్రికెట్ జరుగుతున్న సేపు వీక్షకులకు ఎంత టెన్షన్ ఉంటుందో..ఆటగాళ్లకు కూడా అంతకు రెట్టింపు టెన్షన్ ఉంటుంది.