టీమిండియా క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్ గా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అడ్డంగా బుక్ అయిన విషయం తెలిసిందే.  ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఇష్టంగా చూసే  ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్‌ను క్రీడాభిమానులను నిరాశ పరిచారు. అంతే కాదు అప్పటి నుంచి ఈ ఆటగాళ్ల పేరు ప్రస్తావించిన నాధుడే లేడు.  2013 ఐపీఎల్ సీజన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్లు శ్రీశాంత్, చండీలా, చవాన్లను ఇటీవల ఢిల్లీ ట్రయల్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే  ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఢిల్లీ పోలీసులు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ  పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరోమారు పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది. ఈ సారి మరింత కీలక సమాచారాన్ని పక్కా ఆధారాలతో కోర్టుకు సమర్పించేందుకు ఢిల్లీ పోలీసులు సమాయత్తమవుతున్నారు. దీంతో హైకోర్టు విచారణలో శ్రీశాంత్ సహా ముగ్గురు క్రికెటర్లపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: