క్రికెట్ అంటే అందరూ అభిమానిస్తారు.. ప్రపంచంలో అత్యధికంగా అభిమానించే క్రీడ క్రికెట్. ఇప్పుడు క్రికెట్ కొంతమందికి కనక వర్షం కురిపించేదిగా మారింది. గత కొన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ పై బెట్టింగ్ వ్యవహారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని క్రికెట్ జట్లంటే కొందరికి అభిమానం. మరి కొందరికి క్రికెట్ క్రీడాకారులంటే అభిమానం. ఇక భారత్ , పాకిస్తాన్ పోరంటే రెండు దేశాల మద్య ఉత్కంఠ వాతావరణం నడుస్తుంది.

పాకిస్థాన్-భారత జట్ల మధ్య జరగనున్న ద్వైపాక్షిక సిరీస్ వచ్చేనెల 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని బీసీసీఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా తెలిపారు.  గత కొంత కాలంగా ఇరు దేశాల మద్య ఇప్పటికే అంతర్యూద్దం నడుస్తుంది. పలు ఆందోళనలు, అనుమానాలు, చర్చలు, సమావేశాల అనంతరం శ్రీలంక వేదికగా సిరీస్ నిర్వహణకు రెండు దేశాలు అంగీకారం తెలిపాయి.

దీనిపై పీసీబీ ఆ దేశాక్షుడు నవాజ్ షరీఫ్ నుంచి అనుమతి పొందడం కూడా పూర్తైందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే సిరీస్ ప్రారంభమవు తుందని ఆయన చెప్పారు. వచ్చే నెల 15 నుంచి సిరీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.  పూర్తి కట్టుదిట్టమైన భద్రత మద్య సీరిస్ కొనసాగిస్తామని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: