ప్రపంచంలో క్రికెట్ ఆట అంటే అభిమానంచని వారు ఎవరూ ఉండరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు క్రికెట్ అంటే చాలా ఇష్టపడుతారు. అంత పాపులర్ అయిన క్రికెట్ అన్నా క్రీడాకారుల అన్నా వల్లమాలిన అభిమానులు ఉన్నారు. తాజాగా పాకిస్థాన్ లో తాను అభిమానించే క్రికెటర్ బాగా ఆడుతున్నాడని తన అభిమానాన్ని చాటుకున్నందుకు కటకటాల పాలయ్యాడు ఓ అభిమాని. విరాట్ కోహ్లిపై అభిమానంతో పాకిస్తాన్లో తన ఇంటిపై భారత జాతీయ జెండా ఎగురవేసిన ఉమర్ ద్రాజ్ అనే వ్యక్తిని దేశ ద్రోహం కింద అరెస్టు చేసి జైల్లో వేశారు.

ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య అడిలైడ్ లో జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్ ద్రాజ్ ను ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లి  అజేయంగా 90 పరుగులు చేయడంతో టీమిండియా 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాభిమాని కావడంతో పాటు, ఆసీస్ పై టీమిండియా సాధించడంతో సంతోషంతో భారతీయ జాతీయ జెండాను తన ఇంటిపై ఎగురేసి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు.

విరాట్ కోహ్లీ


దీంతో అతనికి పాకిస్తాన్ పీనల్ కోడ్ ప్రకారం సెక్షన్ 123-ఏ(దేశద్రోహం) కేసు నమోదు చేశారు.ఈ కేసులో 10 సంవత్సరాల శిక్ష పడ్డ ద్రాజ్ తాను ఏ తప్పు చేయలేదని మరోసారి కోర్టు గడప తొక్కినా నిరాశే ఎదురైంది. దీనిపై ద్రాజ్ తరపు న్యాయవాది అమిర్ భట్టి అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు మమ్మల్ని చాలా నిరాశకు గురి చేసిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: