ఏషియన్‌ గేమ్స్‌ 2018లో భారత షట్లర్‌ సైనా నెహ్వాల్‌ పయనం సెమీస్ వరకే పరిమితమైంది.  తాజాగా నేడు జరిగిన ఫైనల్ లో  స్టార్ ఇండియన్ షట్లర్ పీవీ సింధు ఓడిపోయింది. మంగళవారం(ఆగస్టు-28) జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ నెం.1 తాయ్ తుజు ఇంగ్ పై 13-21, 16-21 తేడాతో ఓడిపోయి సిల్వర్ తో సరిపెట్టుకుంది.  సెమీస్‌లో సైనాను ఓడించిన తైజు.. ఫైనల్లోనూ అద్భుత ఆటతీరు కనబర్చింది. ఆరంభం నుంచి ఆధిక్యం కనబర్చిన చైనీస్ తైపీ ప్లేయర్.. వరుస గేముల్లో సింధును ఓడించింది.
Image result for పీవీ సింధు
సోమవారం జరిగిన సెమీస్‌లో జపాన్‌కు చెందిన యమగుచిపై 21-17, 15-21, 21-10 తేడాతో సింధు విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఏషియాడ్ ఫైనల్ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా తెలుగు తేజం చరిత్ర సృష్టించింది. ఇటీవల మలేసియాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ సింధు రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన కార్లోన్ మారిన్‌ సింధును ఓడించింది.

సిల్వర్ గెల్చుకున్న సింధుకి అభినందనలు తెలిపారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్. ఇండియన్ బ్యాడ్మింటన్ హిస్టరీలో ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ట్వీట్ చేశారు. మొత్తానికి  ఏషియన్ గేమ్స్ లో మహిళల సింగిల్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు మరో చరిత్ర సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: