వెనకట కుందేలు, తాబేలు కథ అందరికీ తెలిసిందే.  పరుగు పందెం పెట్టుకున్న కుందేలు, తాబేలు పరుగులో వేగంగా వెళ్లి ఓ చెట్టుకింద కునుకు తీస్తుంది కుందేలు..తాబేలు రాడానికి చాలా ఆలస్యం అవుతుందన్న ధీమాతో..కానీ మెల్లి మెల్లిగా తాబేలు అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంటుంది..అప్పుడు కుందేలుకి భంగపాటు అవుతుంది. ఎదుటి వారిని తక్కువ అంచనా వేస్తే ఎప్పటికైనా దెబ్బైపోవాల్సిందే..అన్న మాట. నిన్న జరిగిన ఆసియాకప్‌లో 2018 లో భారత్ వర్సెస్ హాంకాంగ్ మద్య ఉత్కంఠంగా పోటీ జరిగింది. పసికూనపై పోరాటమే కదా.. అనుకుందో లేదా ప్రత్యర్థి జట్టు అనుకున్నదాని కంటే పటిష్ఠంగా అనిపించిందో కానీ, టీమిండియాకు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్ గెలిచేందుకు నానా తంటాలు పడింది. 


 ప్రధాన ఆటగాళ్లను పక్కనబెట్టి బరిలోకి దిగితే, ఏం జరుగుతుందో చూపించింది. 34 ఓవర్లపాటు భారత క్రికెట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. టాస్ గెలిచిన హాంకాంగ్ మొదట భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్... శిఖర్ ధవన్‌ సెంచరీ, అంబటి రాయుడు అర్ధ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 285 చేసింది. 300 పైగా స్కోరు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ.. స్లాగ్ ఓవర్లలో వికెట్టు కోల్పోవడంతో భారత్ 285 పరుగులకే పరిమితమైంది. ఇక హాంకాంగ్‌పై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పేలవరీతిలో డకౌటవడంతో స్టేడియంలో ఓ బాలుడు చూపిన అసహనం ఇప్పుడు అందరికీ నవ్వు తెప్పిస్తోంది.  


జట్టు స్కోరు 240 వద్ద ఓపెనర్ శిఖర్ ధావన్ (127)120 బంతుల్లో 15 ఫోర్లు, 2సిక్సులతో ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ధోనీ.. హాంకాంగ్ స్పిన్నర్ ఇషాన్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతిని పాయింట్ దిశగా నెట్టేందుకు ధోనీ ప్రయత్నించగా.. బ్యాట్ అంచున తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ స్కాట్ చేతుల్లో పడింది. దాంతో దోనీ డక్ ఔట్ అయ్యాడు.అంతే..ధోనీ వచ్చినపుడు ఓ కుర్రాడు ఎంత సంబర  పడ్డాడో..డక్ ఔట్ కాగానే..పూనకం వచ్చినవాడిలా ఊగిపోతూ..తల బాదుకున్నాడు..డౌన్ డౌన్ అంటూ సిగ్నల్స్ ఇస్తూ..తన ఆవేదన వ్యక్తం చేశాడు.  తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: