ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న భారత్ - పాక్ మ్యాచ్ మొదలైన విషయం తెలిసిందే.   ఈ మ్యాచ్ లో భారత్‌కి శుభారంభం లభించింది.  టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తుండగా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆ జట్టుకి షాకిచ్చాడు. 
asia cup 2018, india vs pakistan: bhuvneshwar provides early breakthrough
భువీ విసిరిన షార్ట్ పిచ్ బంతిని క్రీజు వెలుపలికి వచ్చి హిట్ చేసేందుకు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ప్రయత్నించాడు..కానీ బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ చేతుల్లో పడింది.  ఇదే క్రమంలో..ఐదో ఓవర్‌లో మళ్లీ భువనేశ్వర్ ఆ జట్టుకి మరో  షాకిచ్చాడు.  ప్రస్తుతం పాకిస్థాన్ 73 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఒంటి చేత్తో విజయాన్ని కట్టబెట్టిన ఫకార్ జమాన్(0) చాహల్‌కి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు.   ప్రస్తుతం బాబర్ అజామ్ (40), షోయబ్ మాలిక్(31) రన్ లు చేశారు.  ఆట ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: