భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ అతి తక్కువ కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.  హైదరాబాద్ కి చెందిన సైనా నెహ్వాల్ మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ ప్రపంచ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు కైవసం చేసుకుంది. స్టార్ బ్యాడ్మింటన్  పుల్లెల గోపిచంద్ వద్ద శిక్షణ తీసుకున్న సైనా అంచలంచెలుగా పైకి వచ్చి ఎన్నో మెడల్స్ గెల్చుకుంది.  గత కొంత కాలంగా సైనా వివాహం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.  కాగా ఈ విషయంపై తన పెళ్లి కన్ఫార్మ్ అని తేలిపోయింది. స్వయంగా బ్యాడ్మింటన్ స్టార్ సైనాయే ఈ విషయాన్ని ఖరారు చేసేసింది.  గత కొంత కాలంగా పెళ్లిపై వస్తున్న అనుమానాలకు పులిస్టాప్ పెట్టి..అభిమానులకు శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే.
Image result for saina nehwal kasyap
సహచర ఆటగాడు, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్‌తో ఆమె వివాహం చేసుకోబోతుంది.   వీరిద్దరికి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యిపోయిందని, డిసెంబర్ 16న వివాహం, 21న రిసెప్షన్ కూడా కానిచ్చేయబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై కొన్నాళ్ల కిందట స్పందించిన పారుపల్లి కశ్యప్... పెళ్లి చేసుకోబోతున్న మాట వాస్తవమే కాని, ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదని చెప్పాడు.  సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరూ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ కలిసి పార్టీలకూ, ఫంక్షన్లకూ జట్టుగా వెళ్లడం, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో సైనా, కశ్య ప్ ప్రేమ వ్యవహారం ఎప్పుడో బయటికి వచ్చింది.
Image result for saina nehwal kasyap
అయితే ప్రేమ గురించి, పెళ్లి గురించి కానీ ఇంతవరకూ ఈ ఇద్దరిలో ఎవ్వరూ కూడా స్పందించకపోవడం విశేషం. నా నెహ్వాల్, కశ్యప్ ఇద్దరూ కూడా హైదరాబాదీలే. ఇద్దరూ కోచ్ పుల్లెల గోపిచంద్ శిక్షణలో రాటుతేలినవారే. దాంతో ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి... త్వరలో పెళ్లిపీటలు ఎక్కేదాకా చేరింది.  త్వరలోనే ఈ స్టార్ ప్లేయర్స్ జంట వివాహానికి ఏర్పాట్లు జరగనున్నాయి.  కాగా, ఇద్దరికీ వరుసగా టోర్నీలు ఉన్న కారణంగా వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి వేడుక జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: