ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మౌంట్ మాంగనూయిలో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో కివీస్‌ను చిత్తుచేసింది భారత్. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ దూకుడుగా ఆడింది. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వన్డేల్లో 27వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ధవన్.. బౌల్ట్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.


మొత్తం 67 బంతులు ఎదుర్కొన్న ధవన్ 9 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. 96 బంతులు ఆడిన రోహిత్ 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు ఇది 38వ అర్ధ సెంచరీ.  కోహ్లీ 43, అంబటి రాయుడు 47 పరుగులు చేశారు. ధోనీ 48 (33 బంతులు), జాధవ్ 22 (10 బంతులు) పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించి, నాటౌట్ గా నిలిచారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫెర్గ్యూసన్ లు చెరో 2 వికెట్లు తీశారు.

Image result for team indian vs newzland

మొత్తానికి మౌంట్ మాంగనీలో న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో వన్టేలో టీమిండియా ఆటగాళ్లు సమష్టిగా రాణించి ఆతిథ్య జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 324 పరుగులు సాధించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: