ఈ మద్య టీమ్ ఇండియా ఆటగాళ్లు తమ ఆటతీరులో దూకుడు పెంచారు.  యువ ఆటగాళ్లతో టీమ్ ఇండియా విజయ పరంపర కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే న్యూజిలాండ్ తో జరుగుతున్న సిరీస్ ను 30 తేడాతో గెలుచుకున్న ఇండియా, నేడు హామిల్టన్ లో నాలుగో వన్డేకు సిద్ధం కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన బీసీసీఐ, రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పగించింది.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ను ఎంచుకుంది. 


 హామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీల గైర్హాజరులో న్యూజిలాండ్ తో నాలుగో వన్డేలో తలపడిన టీమిండియా పేలవమైన ఆటతీరును కనబరుస్తూ, 92 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్లలో కనీసం ఒక్కరైనా 20 పరుగుల మార్క్ ను అందుకోలేదు. ఇద్దరు అసలు పరుగుల ఖాతా తెరవకుండానే పెవీలియన్ కు చేరారు.  తొలుత శర్మను క్యాచ్ అండ్ బౌల్డ్ గా అవుట్ చేసిన బౌల్ట్, ఆపై ధావన్ ను ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కు పంపించాడు.


అంబటి రాయుడు, కీపర్ దినేష్ కార్తీక్ లు గ్రాండ్ హోమ్ బౌలింగ్ లో డక్కౌట్ కావడంతో ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.  రోహిత్ శర్మ 7, ధావన్ 13, శుభమన్ గిల్ 9, అంబటి రాయుడు 0, దినేష్ కార్తీక్ 0, కేదార్ జాదవ్ 1, హార్దిక్ పాండ్యా 16, భువనేశ్వర్ కుమార్ 1, కులదీప్ 15, ఖలీల్ 5 పరుగులు చేయగా, చాహాల్ 18 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ కు 5 వికెట్లు దక్కగా, గ్రాండ్ హోమ్ కు 3, ఆస్ట్లే, నీషామ్ లకు చెరో వికెట్ దక్కాయి

మరింత సమాచారం తెలుసుకోండి: