ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తితో వీక్షిస్తున్న ఆట ఐపీఎల్.  ఈ ఆటలో ఎన్నో రకాల చిత్రాలు విచిత్రాలు జరుగుతున్నాయి.  చెత్త రికార్డులు...బంపర్ రికార్డు..రికార్డుల బ్రేక్ ఇలా ప్రతిరోజూ ఆసక్తితో కొనసాగుతుంది.  తాజాగా జోస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా అవుట్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. 

ఈ ఆట గల్లీ లో చిన్నపిల్లల క్రికెట్ ఆటగాళ్లు ఆడినట్టు ఉందని క్రీడా విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోశారు. అయితే అశ్విన్ మాత్రం తన ఆటతీరును సమర్థించుకుంటున్నాడు.  తాను చట్టవిరుద్ధంగా ఏమీ ప్రవర్తించలేదన్న విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు.  అంతే కాదు ఈ విషయంలో తనపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయని..నేను తప్పు చేయలేదు..పశ్చాతప పడాల్సిన అవసరం లేదని అంటున్నాడు.

జట్టు సభ్యులు తనతో ఉన్నారని, చాలామంది ఆటగాళ్లు తనను సమర్థించారని గుర్తు చేశాడు.   మన్కడింగ్ వివాద ప్రభావం తనపై పడబోదని అశ్విన్ పేర్కొన్నాడు. ఈ వివాదంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ సహచర ఆటగాడి తరపున నిలబడ్డారని, మన ఆటగాళ్లు తన తరపున నిలబడ్డారని, ఇది సంతోషించదగ్గ విషయమేనని అశ్విన్ పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: