ఈ మద్య సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంతో ప్రమాదాలు కోరి తెచ్చుకుంటున్నారు.  వీరి వల్ల ఇతరులు కూడా ప్రమాదాలకు లోనవుతున్నారు...కొంత మంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.  తాజాగా ఫుట్‌బాలర్, చెల్సియా అండ్ ఇంగ్లండ్ మిడ్‌ఫీల్డర్ డేనీ డ్రింక్‌వాటర్‌ను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేశారు.

తాగి డ్రైవ్ చేస్తూ ఓ వాహనాన్ని డ్రింక్‌వాటర్ ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడికి గాయాలయ్యాయి. 29 ఏళ్ల ఫుట్‌బాలర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆపై బెయిలుపై విడుదల చేశారు. 

కాగా, డేనీ మే 13న డ్రింక్‌వాటర్ స్టాక్‌పోర్టు మేజిస్ట్రేట్ కోర్టులో  హాజరుకావాల్సి ఉంది.ఇంగ్లండ్ మాజీ మిడ్‌ఫీల్డర్ అయిన డ్రింక్‌వాటర్ ఆగస్టు 2017లో లీసెస్టర్ తరపున ఐదు లీగు మ్యాచుల్లో ఆడేందుకు 35 మిలియన్ పౌండ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: