వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్ లో ప్రారంభమయ్యే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019కి బీసీసీఐ భారత జట్టుని ప్రకటించింది. అంతా ఊహించినట్టుగానే వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ స్థానం దక్కించుకున్నాడు. అయితే ప్రకటన వచ్చే వరకు ధోనీ సెలక్షన్ పై రక రకాల అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.. ఈనేపత్యంలో పలు వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ.. వరల్డ్ కప్ టోర్నీలో తలపడేందుకు 15మందితో కూడిన స్క్వాడ్‌ను విడుదల చేసింది.


స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోనికి చోటు కల్పించారు.   కొన్ని నెలలుగా ప్రపంచ కప్ కోసం టీమిండియాలో 4వ స్థానంపై తీవ్రమైన పోటీ నెలకొంది. ఎవరా అని ఎదురుచూస్తున్న నాల్గో స్థానం కేఎల్ రాహుల్‌ని వరించింది.  తుది 15 మంది సభ్యుల జట్టులో యువ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ ని ఎంపిక చేయలేదు. ఇప్పటి వరకు నెంబర్ 4గా వరల్డ్ కప్ కి ఎంపిక చేయవచ్చని భావించిన తెలుగు తేజం అంబటి రాయుడుకి నిరాశే ఎదురైంది.  

పంచ కప్ జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), కేదర్ జాదవ్, దినేశ్ కార్తీక్, చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్దిక్ పాండ్యా, జడేజా, షమీ


మరింత సమాచారం తెలుసుకోండి: