భారత్ - అఫ్లానిస్తాన్ మ్యాచ్ అనగానే అంతా భారత్ దే విజయం అని సింపుల్ గా తేల్చేస్తారు. కానీ శనివారం నాటి మ్యాచ్ లో అఫ్గాన్లు దాదాపు గెలిచినంత పని చేశారు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. చివరి ఓవర్ వరకూ విజయం కోసం పోరాడారు. 


చివరి ఓవర్ లో ఆఫ్లాన్ విజయం సాధించాలంటే 18 పరుగులు అవసరం.. ఆ దశలో షమీ బౌలింగ్ కు దిగాడు. అప్పటికే అర్థ సెంచరీకి చేరువైన నబీ.. చివరి ఓవర్ మొదటి బంతినే ఫోర్ గా మలిచాడు. దీంతో భారత అభిమానుల్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. 

చివరి ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టిన నబీ..షమీ వేసిన రెండో బంతిని కూడా గాల్లో లేపాడు.. అంది దాదాపు బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ చేతికి చిక్కడంతో అతని కథ ముగిసింది. ఆ తర్వా షమీ అదే ఊపులో మరో రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి భారత్ ను విజయ తీరానికి చేర్చాడు. 

హ్యాట్రిక్ వికెట్లతో భారత్ ను గెలిపించి పరువు దక్కించాడు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 224 పరుగులు చేసింది. కోహ్లీ వరుసగా మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తక్కువ స్కోరు చేసిన భారత్ ను అఫ్లాన్లు గడగడలాడించారు. విజయం కోసం భారత్ చెమటోడ్చేలా చేశారు. అఫ్లాన్లు మ్యాచ్ ఓడినా క్రికెట్ ప్రియుల మనసులు గెలుచుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: