ప్రస్తుతం ప్రపంచంలో వరల్డ్ కప్ 2019 జరుగుతున్న విషయం తెలిసిందే.  చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ సెల్ ఫోన్లు, టీవీలు, ఇతర మాద్యమాల ద్వారా తిలకిస్తూ ఆనందం పొందుతున్నారు. వరల్డ్ కప్ అంటే రికార్డులకు కేంద్రం అని చెప్పొచు.  ఇక్కడ ఒకరిని మించి మరొకరు గత రికార్డులు బద్దలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

తాజాగా  2011 లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన అరుదైన రికార్డు బ్రేక్ చేశాడు బంగ్లా యువ ఆటగాడు.. ఆల్ రౌండర్ షకీబుల్ హసన్. అప్పట్లో ఆల్ రౌండర్ గా యువీ ఓ మ్యాచ్ లో 50 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్ లో ఏకంగా 5 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పగా, దాన్ని నిన్న బంగ్లా ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ దాటేశాడు.69 బంతుల్లో 51 పరుగులు సాధించడంతో పాటు, 10 ఓవర్లు బౌలింగ్ చేసి, 29 పరుగులు మాత్రమే ఇచ్చి, 5 వికెట్లు తీశాడు.

దీంతో పాటు ఈ మ్యాచ్ లో షకీబుల్ పేరిట మరిన్ని రికార్డులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ షకీబుల్‌ హసన్‌ 537 పరుగులు చేసి, మిగతా అందరి కన్నా ముందు నిలువగా, 447 పరుగులతో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఓపెనర్‌ వార్నర్‌ కొనసాగుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: