ప్ర‌పంచ‌క‌ప్‌లో ఎన్నో సెంటిమెంట్లు రిపీట్ అవుతుంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌పంచ‌క‌ప్ క్రికెట్ టోర్న‌మెంటులోనూ చాలా సెంటిమెంట్లు రిపీట్ అవుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఈ ప్రపంచకప్‌లో పడుతూ లేస్తూ వస్తున్న పాకిస్థాన్ 1992లో ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్న నాటి రోజులను గుర్తుకు తెస్తోంది. ప్ర‌పంచ‌క‌ప్ స్టార్టింగ్‌లో దాదాపు ఇంటికి వెళ్లే స్థితిలో  ఉన్న పాక్ అనూహ్యంగా ఇంగ్లండ్‌, అప్ఘ‌నిస్తాన్‌ను ఓడించి ఒక్క‌సారిగా సెమీస్ రేసులోకి వ‌చ్చింది.


ఇక అంచ‌నాల‌కు అంద‌ని విధంగా న్యూజిలాండ్‌ను కూడా 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఇప్పుడు పాక్ త‌న చివ‌రి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఆ మ్యాచ్‌లో పాక్ గెలిచి... ఇంగ్లండ్ త‌న చివ‌రి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే పాక్ నేరుగా సెమీఫైన‌ల్‌కు వెళుతుంది. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌పై పాక్ గెలిచిన మ్యాచ్ పాక్‌కు ఏడో మ్యాచ్‌. ఈ మ్యాచ్‌లో పాక్ 49.1 ఓవ‌ర్ల‌లో గెలిచింది.


స‌రిగ్గా 1992 ప్రపంచకప్ కప్‌లోనూ పాక్ ఏడో మ్యాచ్‌లో సరిగ్గా 49.1 ఓవర్లలోనే విజయం సాధించింది. అంతేకాదు 1992తో పోలిస్తే మ‌రికొన్ని సెంటిమెంట్లు కూడా పాక్ ఈ సారి రిపీట్ చేసింది. 1992లో అప్ప‌ట్లో వ‌రుస విజ‌యాలు సాధించిన న్యూజిలాండ్ తన తొలి ఓట‌మిని పాక్ మీదే న‌మోదు చేసింది. ఇప్పుడు అదే జ‌రిగింది. 


ఈ ట్విస్టులే కాదు 1992 ప్రపంచకప్‌లో పాక్ తన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆ తర్వాత మ్యాచ్‌ను గెలుచుకుంది. మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. నాలుగు, ఐదు మ్యాచుల్లో ఓడింది. ఆరు, ఏడు మ్యాచుల్లో విజయం సాధించింది. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అలాగే జరిగింది. ఈ సెంటిమెంట్లు చూస్తుంటే ఈ ప్ర‌పంచ‌క‌ప్ కొట్టేది త‌మ దేశ‌మే అని పాకిస్తాన్ వాసులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: