క్రీడాభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన భారత్-న్యూజీలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కు అనుకున్నట్టుగానే .. అంతా భయపడినట్టుగానే వర్షం దోబూచులాడింది. కాస్త మబ్బులుగా ఉన్నా ఆటకు మొదట వాతావరణం సహకరించింది.


ఆరంభం నుంచి తడబడుతున్న న్యూజిలాండ్ 46.1ఓవర్లకు 5వికెట్లు నష్టపోయి 211 పరుగులు చేయగలిగింది. భువనేశ్వర్ కుమార్, బుమ్రా, హార్దిక్, జడేజా, చాహల్ తలో వికెట్ తీయగలిగారు. కివీస్ తక్కువ స్కోరుకే పరిమితం అవుతుండటంతో భారత క్రీడాభిమానులు పండుగు చేసుకుంటున్న తరుణంలో వర్షం అడ్డంకిగా నిలిచింది.


వర్షం కురిసే సమయానికి క్రీజులో రాస్ టేలర్(67; 95బంతుల్లో 6ఫోర్లు), టామ్ లాథమ్(3)ఉన్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఇన్నింగ్స్‌లో టేలర్‌తో పాటుగా అత్యధిక స్కోరుతో కేన్ విలియమ్సన్(67)తో ఉన్నారు.


మధ్యలో కొద్దిసేపు వర్షం ఆగినట్టు అనిపించినా.. ఆ తర్వాత మళ్లీ పుంజుకుంది. ఇక ఆట కొనసాగించడం కష్టం అని డిసైడ్ అయిన అంపైర్లు.. రేపు రిజర్వ్ డే రోజు.. మ్యాచ్ కొనసాగించనున్నట్టు నిర్ణయించారు. ఈరోజు ఆట ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచే రేపు ప్రారంభం అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: