డోప్ టెస్ట్ లో విఫలంకావడంతో టీం ఇండియా  యువ ఆటగాడు  పృథ్వీ షా ఫై 8నెలల పాటు నిషేధం విధించింది బీసీసీఐ.  ఇక ఈ వార్త తో కంగుతిన్నాడు  పృథ్వీ షా .  దగ్గు కోసం వాడే సిరప్ లో  టెర్బ్యూటెలైన్-ఏ అనే    నిషేధ వృత్ప్రేరకాన్ని  వినియోగించినందుకు గాను  పృథ్వీ షా  తోపాటు మరో ఇద్దరు యువ క్రికెటర్ల ఫై సస్పెన్షన్ విధించింది బీసీసీఐ. 


ఇక తన సస్పెన్షన్ వార్త తెలుసుకొని  ట్విట్టర్ లో బాగోద్వేగంతో ట్వీట్ చేశాడు పృథ్వీ షా.  నేను  నవంబర్ 15 వరకూ క్రికెట్ ఆడలేనని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. నన్ను ఈ వార్త చాలా బాదిస్తుంది.   దగ్గు, జలుబు తగ్గేందుకు ఉపయోగించే సిరప్‌లో అనుకోకుండా ఓ నిషేధిత పదార్థం ఉండటంతో ఇది జరిగింది.   నేను ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చాక ఈ ఏడాది ఫిబ్రవరి లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో పాల్గొన్నాను.   ఆ టోర్నీలో  నాకు కాలి గాయమైంది. త్వరగా కోలుకోవాలని నిబంధనలు పాటించకుండా  ఆ మందును నేను వినియోగించాను.


ఇది  ఇతర అథ్లెట్లకు  ఆదర్శం కావాలి.  గాయాల నుంచి బయటపడేందుకు మందులు తీసుకొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ విషయంలో  నాకు మద్దతు ఇచ్చిన బీసీసీఐ, నా మిత్రులకు నా ధన్యవాదాలు. క్రికెట్ నా జీవితం. ఇండియా తరఫున ఆడటం లేదు అనేది నా జీవితంలో అతి పెద్ద చేదు వార్త. ముంబై నేను మరింత బలంగా, వేగంగా తిరిగి వస్తాను. నన్ను ప్రోత్సహిస్తున్న అందరికి నా ధన్యవాదాలు  అంటూ పృథ్వీ ట్వీట్ చేశాడు.  ఇక ఆ ట్వీట్ చూసి  భారత క్రికెట్ అభిమానులు  పృథ్వీ కి ఇలా జరిగి ఉండకూడదని ఈ విషయంలో  అతనికి మద్దతు తెలుపుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: