యాషెస్ సిరీస్ లో భాగంగా  సొంత గడ్డపై జరుగుతున్న మొదటి టెస్ట్ లో  చిత్తుగా ఓడిపోయింది  ఇంగ్లాండ్.  382 పరుగుల లక్ష్యం తో చివరి రోజు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇనింగ్స్ లో  ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయాన్ , ఫాస్ట్ బౌలర్ కమ్మిన్స్ దాటికి 146 పరుగులకే  కుప్ప కూలింది. ఫలితంగా 251 పరుగుల తేడాతో ఆసీస్  విజయ కేతనం ఎగుర వేసింది.  

13/0 స్కోర్ తో 5వరోజు  ఇన్నింగ్స్ ను కొనసాగించిన  ఇంగ్లాడ్ కు ఆదిలోనే షాక్ తగిలింది. 11 పరుగుల వ్యక్తి గత స్కోర్ వద్ద మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రోరి బర్న్స్ ను కమ్మిన్స్ పెవిలియన్ కు పంపించగా  ఆతరువాత  జాసన్ రాయ్ తో కలిసి కెప్టెన్ జో రూట్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే అద్భుతమైన బంతితో లయన్, రాయ్ వికెట్ తీయడంతో అక్కడినుండి ఇంగ్లాండ్ పతనం మొదల్యయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పయి ఓటమి చవి చూసింది. 37 పరుగులతో వోక్స్ ఒక్కడే కాసేపు పోరాటం చేశాడు.  


అద్భుతంగా బౌలింగ్ చేసిన నాథన్ లాయన్ 6 వికెట్లు పడగొట్టగా కమ్మిన్స్ 4 వికెట్లు ను ఖాతలో వేసుకున్నాడు.  మొదటి ఇన్నింగ్స్ తో పాటు రెండో ఇనింగ్స్ లో కూడా సెంచరీ చేసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్మిత్ కు  ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ సిరీస్ లో రెండో టెస్ట్ ఈనెల 14న ప్రారంభం కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: