పాకిస్థాన్ అంటే అంత ఆషామాషీ టీం కాదు.క్రికెట్ లో అదొక సంచలనం.కానీ ఈ మధ్య సరిగ్గా ఆడటం లేదు అని విమర్శకుల మాటలను నిజం చేసి చూపుతున్నారు పాకిస్థాన్ ఆటగాళ్ళు అందుకు నిదర్శనంగా మొన్న జరిగిన మ్యాచ్ నిలిచింది.

ముగిసిన టీ20 సిరీస్‌ని 0-3తో చేజార్చుకున్న పాకిస్థాన్ తప్పుల దిద్దుబాటు చర్యలకి దిగింది. ఈ మేరకు సర్ఫరాజ్ అహ్మద్‌ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి వెంటనే తప్పించాలని చీఫ్ కోచ్, చీఫ్ సెలక్టర్‌గా ఉన్న మిస్బావుల్ హక్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి తెలియజేసినట్టు వార్తలు  శ్రీలంకతో సిరీస్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన

సర్ఫరాజ్ అహ్మద్  కెప్టెన్‌గానూ తప్పుడు నిర్ణయానికి  గురై జట్టుని సరైన మార్గం లో తీసుకువెళ్ల లేక పోయాడు.

దీంతో అతని కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.వాస్తవానికి ఈ ఏడాది ప్రపంచకప్ ముగిసిన వెంటనే అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి పీసీబీ తీసేసే దిశగా పావులు కలుపుతుంది. అప్పటి కోచ్ మిక్కీ ఆర్థర్ కూడా సర్ఫరాజ్‌కి వ్యతిరేకంగా తానే స్వయంగా రిపోర్ట్ రాసి ఇచ్చాడు.. అనూహ్యంగా కోచ్‌‌ని తప్పించిన పీసీబీ.. కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ని కొనసాగించింది. అయితే తాజాగా సొంతగడ్డపై అదీ శ్రీలంక ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో పాక్ ఓడిపోవడంపై పీసీబీ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియాతో త్వరలోనే పాకిస్థాన్ జట్టు సుదీర్ఘ సిరీస్ ప్లాన్ చేసుకుంది. అప్పటిలోపు ఈ కెప్టెన్సీ మార్పు పూర్తి చేయాలని పీసీబీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సర్ఫరాజ్‌ కెప్టెన్సీపై వేటు పడితే T20, వన్డే కెప్టెన్‌గా బాబర్ అజామ్ ను తీసుకొనే ప్లాన్ లో కూడా ఉంది.కాబట్టి ఇకనైనా పాకిస్థాన్ క్రికెట్ టీం అండ్ కెప్టెన్ తన వైఖరిని ,వ్యూహాన్ని మార్చి గెలిచి,నిలుస్తారేమో చూడాలి.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: