నేడు ప్రారంభమైన దక్షిణాఫ్రికాతో  ఝార్ఖండ్‌లోని రాంచీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. ఇప్పటికే టీమిండియా 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే కదా... ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావనలో ఉంది కోహ్లీసేన.


ఇక  ఆసియాలో వరుసగా 9 సార్లు టాస్ ఓడి ఉండటంతో.. ఈ రోజు టాస్‌కి వైస్ కెప్టెన్ బవుమాతో కలిసి దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ రావడం జరిగింది. దీంతో.. కోహ్లీ  కాయిన్ ఎగురవేయగా.. డుప్లెసిస్‌కి బదులు బవుమా టాస్ చెప్పాడు. అయినప్పటికీ కూడా  దక్షిణాఫ్రికా టాస్ ఓడిపోయారు. ఇక  తొలి టెస్టులో  విశాఖపట్నం వేదికగా జరిగిన 203 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత రెండో టెస్టులో  పుణె వేదికగా జరిగిన ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో 
విజయాన్ని సొంతం చేసుకుంది.


ఇటీవల జరిగిన వైజాగ్ టెస్టులో ఎల్గర్, డికాక్ 100 పరుగులు తీసి  కాస్త పోటీనిచ్చినట్లు కనిపిచింది, కానీ చివరికి దక్షిణాఫ్రికా పుణె టెస్టులో మాత్రం గెలుపు సొంతం చేసుకోలేక పోయింది. ఇంకోవైపు దక్షిణాఫ్రికా ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచాలనే    అనే భావనతో రంగంలోకి దిగింది. భారత్  జట్టులో  చైనామన్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ గాయం కారణంగా అతడికి బదులు నదీమ్‌ను ఈ మ్యాచ్‌లో  రంగంలోకి దిగుతున్నాడు.


గతంలో  టెస్టు హోదా పొందిన రాంచీ స్టేడియం పిచ్ స్పిన్నర్లకి అనుకూలంగా  2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ డ్రాగా  నిలిచింది. ఆ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలపడం కూడా జరిగింది. ప్రస్తుత సమయానికి మ్యాచ్‌లో భారత్  3  వికెట్లు కోలుపోవడం జరిగింది. ప్రస్తుతానికి రోహిత్ శర్మ, అజింక్య  రహానే  క్రీజ్ లో  బాటింగ్  చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: