ఈ మధ్య సెలబ్రటీలు తప్పతాగి యాక్సిడెంట్స్ చెయ్యడం షరా మాములు అయిపోయింది.ముఖ్యంగా తమిళ బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ అయిన యశికా ఆనంద్ నిన్న రాత్రి ఆదివారం అవ్వడంతో కొందరి స్నేహితలతో కలిసి తప్ప తాగి ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తూ స్విగ్గి డెలివరీ బాయ్ ని గుద్దేసి అటు పిమ్మట పక్కనే ఉన్న ఒక షాప్ లోకి కూడా అంతే వేగంగా దూసుకొని పోయింది అంట ఆమె కార్. దాంతో అంతటితో ఆగకుండా ఆపితే ఎక్కడ పట్టుకుంటారో అని అక్కడి నుండి వెళ్ళిపోయిందని ఆ స్విగ్గి కుర్రాడికి తీవ్ర దెబ్బలు, ఆ షాప్ వాడికి తీవ్ర నష్టం కూడా కలిగిందని,ఆ సమయంలో యశికా మరియు వారి స్నేహితులు తప్ప తాగి మరి ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసారని అక్కడి ప్రజలు వాపోతున్నారు.స్టార్ డమ్ నెత్తిన ఎక్కితే మందు తలను దాటి ఎక్కేస్తది అనే సామెతను నిజం చేసి చూపింది యశికా అంటూ అక్కడి చిన్న,సన్నకారు ప్రజలు తిట్టిపోస్తున్నారు.

కొద్దిగా డబ్బులొస్తే ఇలా మైండ్ సెట్ ని మార్చుకోవడమేనా ఎంత సెలబ్రటీ అయితే మాత్రం కనీసం పొరపాటునా గుద్దిందే అనుకో వెంటనే వారిని క్షమించమని అడిగి క్షత గాత్రుడుని హాస్పిటల్ కి తీసుకుపొయ్యి వారి హృదయాల్లో నిలిచిపోవాల్సింది పొయ్యి ఇలా పరారీలోకి పోతే ఏమి స్టార్స్ అవుతారు, ఎలా రాణిస్తారు ఈ ఫీల్డ్ లో అంటూ నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.ఇలా ఒక్క యశికా ఆనంద్ మాత్రమే కాదు ఎందరో మద్యం బానిసలు రాత్రైతే ఇలా ఘోరాలు చేసేస్తున్నారు.ఇలాంటి వారిని కూడా గవర్నమెంట్ వారు శ్రద్ధగా పట్టించుకొని సమ న్యాయం చేయాలని మనందరం కోరుకుందాం.

యశికా ఇటీవల జోంబి అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతకుముందు ఇరుత్తు అరైయిల్ మురత్తు కుత్తు అనే చిత్రం ఆమెకు నటిగా మంచి పాపులారిటీని తీసుకొచ్చింది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యశికా.. ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: