బిగ్ బాస్ తెలుగు సీజన్ చివరి దశకు చేరుకుంటోంది.  బిగ్‌బాస్ షో సీజన్ 3 ఎండ్ కావడానికి మరో 23 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎక్కడో హాలీవుడ్‌లో పాపులర్ అయిన బిగ్‌బాస్ కార్యక్రమం హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా గ్రాండ్ సక్సెస్ అయింది. తొలి రెండు షోలను ఎన్టీఆర్, నాని హోస్ట్ చేయగా.. మూడో సీజన్‌‌కు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. 


ఈ ఆదివారంతో బిగ్‌బాస్ 77 రోజులు కంప్లీట్ చేసుకోనుంది. ఈ వివాదాస్పద రియాలిటీ షో కోసం స్టార్ మా భారీగానే రెమ్యునరేషన్ ముట్టజెపుతున్నట్టు సమాచారం. బిగ్‌బాస్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జునకు ప్రతీ ఎపిసోడ్‌కు రూ.12 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. నాగార్జునకు మొత్తం సీజన్ 3 కోసం సుమారు రూ.12 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోనే అవకాశం ఉంది
ఈ షోలో పార్టిసిపేట్ చేసేవాళ్లకు స్టార్ మా నిర్వాహకులు బాగానే ముట్టు చెప్పినట్టు సమాచారం. 


ఆల్రెడీ బిగ్‌బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరికి ఎంత ముట్టజెప్పారో తదితర విషయాలు వెల్లడించారు. ఒక్కో కంటెస్టెంట్‌కు ఒక్కో రకంగా అటు ఇటుగా పాతిక లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమచారం. మరోవైపు ఎపిసోడ్‌కు ఇంత అని కూడా మరో లెక్క ఉంది.  మరో వైపు ఏరికోరి తెచ్చుకున్న తెచ్చుకున్న శ్రీ ముఖి కి ఒకటి రెందు కాదు ఏకంగా 3.5 కోట్లకు పైగానే పారితోషికంగా ఇచ్చారని వార్తలు వచ్చాయి.


ఈ లెక్కన బిగ్‌బాస్ విజేతగా బయటకు వెళ్లేవాళ్లకు ఫ్రైజ్ మనీ రూ. 50 లక్షలతో పాటు అవి ఇవి కలిపి రూ.కోటిన్నర  వరకు దక్కే అవకాశం ఉందని బిగ్‌బాస్ హౌస్ నుండి  బయటకు వచ్చిన కంటెంస్టెంట్స్ పలు యూట్యూబ్ ఛానల్స్‌తో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: