దక్షిణ మధ్య రైల్వే కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం ఎంత రద్దీగా ఉంటాదో ప్రతేకంగా చెప్పవలిసిన అవసరం లేదు. ఇంకా పండుగల సందర్భాలలో ప్రత్యేకంగా చెప్పవలిసిన అవసరమే లేదు. ఒక పక్క దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఎంఎంటీఎస్‌ మాత్రమే కాకుండా కొన్ని గూడ్స్ రైళ్లు కూడా వస్తా పోత ఉంటాయి. ఇంకా అయితే సోమవారం సాయంత్రం జరిగిన సంఘటన ప్రయాణికుల ప్రాణాల మీదకు వచ్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో అనౌన్స్‌మెంట్‌ను తప్పుగా విన్న ప్రయాణికులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. 


అయితే సోమవారం సాయంత్రం 3.50 గంటల సమయంలో ప్లాట్‌ఫాం నెంబరు ఒకటిపై ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు వచ్చేది ఉంది. అయితే అదే సమయంలో ఫలక్‌నామ ఎంఎంటీఎస్‌ రైలు 4 వ నెంబరు ప్లాట్‌ఫాంపైకి వచ్చినట్లు అనౌన్స్‌మెంట్‌ అయింది. దీంతో హౌరా ఫలక్‌నుమా రైలులో వెళ్లాల్సిన ప్రయాణికులు రైలు వచ్చేసిందన్న తొందరలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపైకి వెళ్లకుండా ఉరుకులు పరుగులతో నేరుగా పట్టాలు దాటుకుంటూ వెళ్లారు.


అయితే అదే సమయంలో కాగజ్‌నగర్‌ వైపు వెళ్లే భాగ్యనగర్‌ రైలు కదలడంతో పట్టాలు దాటుతున్న ప్రయాణికుల ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్లు అయింది. చివరికు  వచ్చింది ఎంఎంటీఎస్‌ అని తెలుసుకున్న ప్రయాణికులు మళ్లీ ఒకటో నంబర్‌ ఫ్లాట్‌పాంపైకి వచ్చేసారు. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్‌ ముందు నుంచే కొందరు వెళ్లడం అదే సమయంలో కొందరు పట్టాలు దాటుతుండడంతో కొంత టెన్షన్‌ నెలకొంది అక్కడ ఉన్న ప్రయాణికులకు.


ఇలాంటి సంగటనలు మళ్ళి పునరావృతం కాకూడదని అక్కడున్న ప్రయాణికులు అధికారులతో వాదించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సరే ఇలాంటి సంగంటనలతో ప్రయాణికులు తగు జాగ్రత్త పాటించడం చాల అవసరం. లేకుంటే ఇలా ప్రాణాలమీదకు వస్తాయి. ఎందుకంటే మనిషి ప్రాణం కంటే ఇంకా ఏది ముఖ్యం కాబట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి: