ప్రతి మనిషికి ఏదో ఒక టైమ్ లో ఒకానొక సమయంలో ఆవేశము రావడము సహజసిద్ధము. ఆయా వేషమును అదుపులో ఉంచుకొనుట మానవ ధర్మం. ఆవేశము వచ్చినప్పుడు వాట్సాప్లో ,ఫేస్బుక్లో, మాట్లాడేటప్పుడు కొంచెం గమనించి మాట్లాడవలెను.అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే తర్వాత చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది.నెటిజన్లూ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఎక్కడైనా, ఏదైనా విపరీతం జరిగితే. ఆవేశము తగ్గించుకోండి.. ఆవేశంగా మీ ఆక్రోశాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టకండి. ఉరితీస్తేస్తా, అంతుచూస్తా అంటూ, నాకు అప్పగించండి, నిన్ను ఏం చేస్తానో చూడు మొదలైన వంటి పదాలతో పోస్టులు పెడుతున్నట్లైతే... మీరు ఓసారి ఆలోచించుకోవడం చాలా మంచిది. మనం ఏం చేసినా చట్టపరిధిలో చెయ్యాల్సిందే. 


ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేయుట చట్టవిరుద్ధం. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలోనూ సైబర్ క్రైమ్ రూల్స్‌ని ఇకపై కచ్చితంగా పాటించాలంటున్నారు పోలీసులు. ఇకపై ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, టిక్ టాక్ ఇలా అన్ని రకాల సోషల్ మీడియా యాప్స్, అన్నింటిపై వెబ్‌సైట్లపై, పోలీసులు ఫుల్ నిఘా పెడుతున్నారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న వ్యక్తి నేను ఎక్కడో ఉన్నాను కదా నన్ను ఎవరు పట్టుకోలేరు లే అనివివాదాస్పద కామెంట్ చేసినా... ఇకనుంచి పోలీసులు ఇట్టే కనిపెట్టేయగలరు. మనము  పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే దాని సంగతి తెలిసిపోతుంది.. ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచీ పెట్టారు, అన్ని వివరాలూ పోలీసులకు తెలిసిపోతాయి. తర్వాత విచారించడం అంటూ ఏమీ జరగదు. ఆ తర్వాత అంతా అరెస్టులే. దిశ హత్యాచారం కేసు దృష్ట్యా సోషల్ మీడియాపై స్కానింగ్ మరింత ఎక్కువైంది. ఇప్పటికే తాజాగా ఇద్దరు యువకుల్ని కూడా అరెస్టు చేశారు. వాళ్లిద్దరూ కూడా సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టినవాళ్లే.


ఇటీవల హైదరాబాద్‌లోని రాయదుర్గంకి చెందిన ఓ మహిళా డాక్టర్ ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. ఆ డాక్టరు పెట్టిన పోస్టుపై ఓ కుర్రాడు అసభ్య కామెంట్ పెట్టాడు. దానితో ఆగ్రహించిన ఆ డాక్టరు వెంటనే   పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి నల్గొండలోని గుండ్రాలవల్లిలో ఆ కుర్రాణ్ని అరెస్టు చేశారు. ఇలాగే గుంటూరుకు చెందిన మరో ఇంజినీరింగ్ విద్యార్థి కూడా కటకటాలపాలయ్యాడు. అతను కూడా మహిళలపై చెత్త పోస్టులు పెట్టినవాడే. ఎలా పెట్టిన ఎవరు మనల్ని ఏమి అన్నారు లే అనేటువంటి ధీమా చాలామందిలో ఉంది.

 

భావప్రకటనా స్వేచ్ఛ అనేది హద్దుల్లో ఉండటమే మంచిది హద్దుమీరి ప్రవర్తిస్తే చాలా ఇబ్బందులకు గురి కావలసి వస్తున్నది. స్వేచ్ఛ పేరుతో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడితే ఇప్పటినుంచిఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. అందువల్ల నెటిజన్లు రూల్స్ పాటించడం ఉత్తమమైన పని. రూల్స్ పాటించకపోతే అరెస్టులు, జైళ్లకు వెళ్లడం తప్పనిసరి అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: