ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్ లలో గూగుల్ డియో గ్రూప్ కాలింగ్ ఉపయోగిస్తున్నాము. అతి త్వరలోనే ఈ సదుపాయం గూగుల్ క్రోమ్ లో రావడానికి సన్నాహాలు చేస్తుంది. ఇక కరోనా వైరస్ సందర్భంగా బంధువులకు సన్నిహితులకు దూరంగా ఉంటున్న పరిస్థితులలో గూగుల్ డియో సరికొత్త ఫ్యూచర్ ప్రకటించడం జరిగింది. ఇక వారం రోజులలో ప్రోగ్రాంలో దీనికి సంబంధించిన ప్రివ్యూ మొదలవబోతోంది. అంతే కాకుండా కొత్త లేఅవుట్ తోపాటు వెబ్ ‌లో డుయో గ్రూప్‌ కాంలింగ్  సదుపాయం కూడా అందుబాటులోకి రాబోతోంది. 

 


ఈ గ్రూప్ కాలింగ్ ఎక్కువ మందితో చేసుకోవడానికి కూడా సహాయపడుతుంది. గూగుల్ అకౌంట్ ఉన్న వారు ఎవరైనా సరే స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు పంపిన లింకు ద్వారా గ్రూప్ కాల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా తక్కువ బ్యాండ్ కనెక్షన్ లో కూడా నాణ్యమైన క్లారిటీతో కూడిన వీడియో కాల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం కొత్త వీడియో కూడా టెక్నాలజీని ఉపయోగించారు. వీడియో కాలింగ్ చేసే సమయంలో ఫోటోలు డిలీట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని గూగుల్ సంస్థ తెలిపింది. ఇక అలాగే ఒక్కసారి 12మందితో గూగుల్ వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు అని తెలుస్తోంది. ఇకపోతే 24 గంట‌ల త‌రువాత మీకు వ‌చ్చిన వీడియో, వాయిస్ మెసేజ్‌లు అటో సేవ్ అయ్యేలా ఫ్యూచ‌ర్ ‌ను కంపెనీ క‌ల్పిస్తుంది. ప్ర‌తి 7 రోజుల్లో 10 మిలియ‌న్లు పైగా కొత్త వ్య‌క్తులు డుయో కోసం సైన్ అప్ చేస్తున్నార‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలియచేస్తున్నారు. 

 


దీనితో జూమ్, పేస్ బుక్ చాట్ రూమ్స్ కు గూగుల్ మంచి పోటీలను ఇవ్వనుంది. ఏదైనా సరే కానీ మీ అకౌంట్ పాస్వర్డ్ ని మాత్రం వెరికోరి చేతిలో మాత్రం ఇవ్వకండి. ఇలా చేస్తే మోసపోయేది మిరే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ...! ఈ మధ్య ప్రతిదీ గూగుల్ అకౌంట్ లోకి లింక్ ఉంటుండడంతో కాస్త జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: