దక్షిణ కొరియా బడా సంస్థ అయిన సాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ జూన్ 8వ తేదీన విడుదల చేస్తున్నామని ప్రకటించింది. అయితే ఈ గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్లను సాంసంగ్ సంస్థ వెల్లడించలేదు. కానీ ఏ డివైస్ అమెజాన్ డాట్ ఇన్, ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ వెబ్ సైట్స్ ద్వారా విక్రయించబడుతుందని అని తెలిపారు. వాస్తవానికి కొన్ని రోజుల క్రితమే గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ చైనాలో, ఇతర దేశాల్లో విడుదల అయ్యాయి. అయితే వాటి ధర మన భారతదేశంలో విడుదలయ్యే వాటి ధర దాదాపు సరిసమానంగా ఉంటాయని తెలుస్తోంది. సాంసంగ్ గెలాక్సీ s6 లైట్ ధర చైనాలో RMB 2,799 ఉండగా... భారతదేశంలో దాని విలువ రూ.30 వేలు ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే కేవలం 4gb ram 64 జీబీ ఇంటర్నల్ మెమరీ తో లభించనున్న వైఫై ఓన్లీ వెర్షన్ సపోర్ట్ చేసే గాలక్సీ ట్యాబ్ s6 లైట్ ధర రూ. 30 వేలు అని గమనించగలరు. హయ్యర్ ఎండ్ స్పెసిఫికేషన్స్ తో లభించే 128gb ఇంటర్నల్ మెమొరీ కలిగి ఉన్న LTE వెర్షన్ చైనాలో RMB 3399 ఉండగా... మన భారతదేశంలో దాని ధర 36 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. 


సాంసంగ్ గాలక్సీ ట్యాబ్ s6 లైట్ లో 10.4 అంగుళాల WUXGA (1,200 × 2,000 పిక్సెల్స్) డిస్ప్లే, S-Pen స్టైలస్, ఎకెజి ట్యూనింగ్ ఉన్న డ్యూయల్ స్పీకర్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ లభిస్తున్నాయి. ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ పై రన్ అవుతుంది. గాలక్సీ ట్యాబ్ s6 లైట్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఆప్షన్ వరకు లభిస్తుందని తెలుస్తుంది. అయితే గాలక్సీ ట్యాబ్ s6 లైట్ లో ఏ ప్రాసెసర్ ఉపయోగించారు అన్నది తెలియాల్సి ఉండాలి గా... నివేదికల ప్రకారం ఆ ప్రాసెసర్ ఆక్టా కొర్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. 


గాలక్సీ ట్యాబ్ s6 లైట్ లో డిస్ప్లేయి విషయానికి వస్తే LCD ప్యానెల్ అమర్చరా లేకపోతే super AMOLED అమర్చరా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు విడుదలైన లీక్స్ ప్రకారం ఈ ట్యాబ్ లో LCD ప్యానెల్ పొందుపరచారని తెలుస్తుంది. గతంలో వచ్చిన S6, S5g టాబ్స్ లలో మాత్రం super AMOLED ప్యానెల్ ఇచ్చారు. లీక్స్ ప్రకారం గాలక్సీ ట్యాబ్ s6 లైట్ లో ఎక్సీనోస్ 9611 ప్రాసెసర్ ఇచ్చారని తెలుస్తోంది. నిజానికి ఈ ప్రాసెసర్ బడ్జెట్ సాంసంగ్ మొబైల్ ఫోన్లలో ఎక్కువగా పొందుపరుస్తున్నారు. గాలక్సీ ట్యాబ్ s6 లైట్ ఏడు మిల్లీమీటర్ల మందం, 798 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: